Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

తెలుగు భాషా చరిత్ర

వాదిస్తారు. 'పొణ్ఠె' నన్నయకు తరవాతి కావ్యభాషలో కూడా చాలా విరళంగా ఉండేది.

     'మిన్ద, మీన్ద, మీద; కడ; పై;' అనే అనుబంధాలు మాత్రమే పంచమ్యర్థ సూచకాలుగా శాసనభాషలో కనిపిస్తాయి. ఉదా. మహి-మిన్ద (SII 6 585.1,633-63), గుడి-మీన్ది (పై.4.1014.6,1038), మీద (పై.10.605.8.8); భూపాదిత్యుల-కడాన్‌ (పై. 604. 22,10). భూసతి-పై (EI 4.314-1817, 1075-76). ఈ శాసనాల్లోనే 'పై' స్వతంత్ర శబ్దంగా కూడా ప్రయుక్తమయింది. ఉదా. పై-లేచిసేన (భారతి 5.473 84.4, 848), పయ్‌ -వారల (శా. ప. మం. 1.2-3 18, 899-934)                                                                
                                                                
     షష్టీసూచకమైన ప్రత్యేక విభక్తి ప్రత్యయం కనిపించదు. ద్వితీయాది విభక్త్యంగమే షష్టీవిభక్తిసూచకంగా ఉండేది.
     సప్తమ్యర్థంలో 'Ø, (౦), అన్‌, న' అనే పదాంశాలు, 'అందు, ఒళన, లో (౦), లోన, లోపలి, ళోన' అనే అనుబంధాలు శాసనభాషలో ఉన్నాయి. ప్రత్యయాలకు ఉదాహరణలు : వారనాశి-Ø (SII 10.611.2-3, 8), తిర్పలూర్‌-అ (EI 27.231-34.7-8, 625-50), బెజవాడ్‌-అం (శా. ప. మం. 1.2-3.27, 898-934), అన్వయంబు-న (భారతి 23.182-186.13-14, 641). హలంత ప్రాతిపదికమీద ఆజాది ప్రత్యయాలూ, అజంత ప్రాతిపదిక మీద హలాది ప్రత్యయాలూ పర్యాయ ప్రవృత్తిలో ఉన్నాయి. ఆనుబంధాలకివి ఉదాహరణలు : ఊడ్ల్-అందు (SII 6.585 9, 633-63), రాజుల్ల్-ఒళన- ఆం. ప. 1941-42.1,600-25), ఆజి-లోం  (భారతి 5.618.7, 897), భూమిలోన (పై. 15.850 ), కయ్యంబు-ళోన (SII 10 623.7-8, 9/10), డొంక-లోపలి (త్రిలింగ రజతోత్సవ సంపుటి 352-64.17,991), పైవాటిలో 'ఒళన>ళోన>లోన' ఉత్తరోత్తరం ఆర్వాచీనమైనవి. మూలద్రావిడం లోని *ఉళ్/ఒళ్ ధాతురూపం క్రీ. శ. ఏడో శతాబ్ధిదాకా తెలుగులో నిలిచి ఉండటం విశేషమే. ఈ శాసనాల్లోనే 'లోపు' స్వతంత్ర శబ్దంగా క్రీ. శ. పదకొండో శతాబ్ది శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. 'పల్లికి లోపైన ఇల్లకు ... (SII 10 651. 14. 1090-91), వెలకుంగొని విడిచిన యిల్లు లోపుగా ... (పై 13), పెడరు-లోపుగా యిల్లుపట్టు పై. 4.1161.11, 1082), ... బోయుణ్డును లోపైన