ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం 67
గమం జరగటం విట్టజులవంటి చోట్ల రేఫను ఱకారంగా పల్కటం, ఈ సంధిలోని విశేషాలు. వీటిని బట్టి క్రీ. శ. తొమ్మిదో శతాబ్దిలో ఱకారానికి స్పర్శ ధ్వని లక్షణం ఉండేదని, 'డ-ఱ' లకు (లేదా *న -ద -లకు) స్పృష్ణోష్మ లక్షణాలుండేవని ఊహించవచ్చు.
పదాంతాక్షర నంధి : పదాంత సంవృతాక్షరాల్లోని న, మ లకు క్రీ. శ. 4/5 శతాబ్దిలో ప్రత్యేకవర్ణత్వం పోయిందని చెప్పవచ్చు. కమ్బురా ఞ్చెరువ (భారతి 1.110-22.15, 395-410), చెఞ్చెఱువ (పై. 13-14) వంటిమ్ మాటలను బట్టి పదాంతంలో నమలు ప్రత్యేక వర్ణత్వం కోల్పోయి సవర్ణంలో మేళవించాయి. క్రీ. శ. ఏడో శతాబ్దిలోని ఉదక పూవ్వ౯లజ్కేసి' (EI 30 69-71.5, 699-700) అనే పదబంధం సంవృతాక్షరంలో పదాంతమకారం కంఠ్యస్పర్శంగా మారిందని నిరూపిస్తున్నది.
3.29. మహదేకవచనం : క్రీ. శ. పదకొండో శతాబ్ది వరకుగల శాసనభాషలో 1882 విభిన్న విశేష్యపదాలు లభిస్తున్నాయి. వాటిలో 573 దేశ్యాలు ; 211 తద్భావాలు; 424 తత్సమాలు. మహద్వాచక విశేష్యాలలో చాలా వరకు లింగబోధక ప్రత్యయాలు లేనివే. ఉదా...తలవరి (పై. 20.1-7 B 1.5. 3), మన్చ్యణ్ణ (పై. 17.334-37. 11, 610), రాజు - (పై. 27.221-25, 2-3, 575-600), కమ్మరి (ఫై. 234-36.21, 625-50), కొడుకు (JVOI 15.41-42.6, 740). కొన్ని మాటలు (ప్రథమైకవచన ప్రత్యయం ఉండీ, లేకుండా కూడా కనిపిస్తున్నాయి. ఉదా, (i) దేశ్యాల్లో : గణ్డ (SII 10.635.5.80): గణ్డడు (El 4,314-18.18,1075-76); (ii) తద్భవాల్లో: ఓజు(భారతి 3.83 94.56-57, 1060), ఓజన్ఱు (EI 27.240-42. 19-20,725); (iii) తత్సమాల్లో డుమంతానికి సంప్రదాయ వ్యాకరణాలు చెప్పేచోట్ల ప్రత్యయరహిత శబ్దాలు కొన్ని కనిపిస్తున్నాయి, ఉదా. పాతకు (పై. 228-29. 8, 600-25), పణరంగు (భారతి 5.473-84. 5, 848). ప్రత్యయయుక్తంగా ఉన్న మహద్విశేష్యాలు విభిన్న ప్రత్యయాలతో కనిపిస్తున్నాయి, ఉదా. ధనంజయు -ఱు (El 27.221-25.3-4,575-600), ఉత్తమోత్తము-న్ఱు (పై. 231-34. 4,625-50), వా-ణ్డు (SII 10.599. 33, 625-50), సంయుక్తు-ణ్ఱ్ (EI 30. 12-31,8), కుళ్ళమ్మ-న్ (SII 10.631. 6, 9/10). ఈ ప్రత్యయాల్లో -లు లేఖక ప్రమాదంవల్ల వచ్చింది కావచ్చు. '-న్' అనేది