61. ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
(అహ1 హ2 ఆ) మరికొన్ని ఏర్పడ్డాయి. అలాంటి మార్పుల్లో 'ణ్చ' కారం 'న్చ'గా మారటమొకటి. అది క్రీ. శ. తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఉదా. పణ్చిన (భారతి 5.473-848), పన్చిన (పై. 618.7850) 'ళ' క్రీ. శ. ఏడో శతాబ్ధికే 'ల్క'గా మారింది. ఉదా. పల్కిన (EI 230-31, 625-50). సంయుక్షాకరగతమైన శకటరేఫ ఆకాలలోంనే సాధురేఫగా పరిణమించింది. ఉదా. తూఱ్పు (భారతి 5.935-48. 11,675), తూప్పు౯న (SII 6.584.8,641). 'న్ఱ'కారం 'న్డ, ణ్డ. న్డ', లుగా మారటం కూడా అప్పుడే జరిగింది. ఉదా. తాన్ఱికొన్ఱ (IA 9.102-3.75), కొఱ్డ (EI 27.231-34.8,625-50), పణ్ఱేణ్డు (SII 10.599,31, 625-50), వాణ్డ్ (పై. 4.1015.12,1084); ఇన్ఱు. (పై. 10.46.2,7), ఇన్డుల (పై. 10.599.32,625-50). 'ళ్ప'కారం క్రీ. శ. తొమ్మిదో శతాబ్దిలో 'ల్ప'గా మారింది. ఉదా. వెళ్పు (పై. 6.585.2,633-63), వెల్పూరు) (EI 5.122-26.29,844-88). సంయక్తాకర గతమైన సాధురేఫ వర్ణ సమీకరణం వల్ల మీది హల్లుతో కలిసి క్రీ. శ. తొమ్మిదో శతాబ్ది నుంచి ఆజ్మధ్యద్విరుక్త హల్లుగా మారింది. ఉదా. ఉపు౯టూరు (SII 1.31-36.25, 794-842), ఉప్పుటూరు (భారతి 1.90-110 65,844 -88).
3.20 ఇయ>-య : పదమధ్యాచ్చు లోపించినందు వల్ల అజ్మధ్యంలో సంయుక్తాక్షరం ఏర్పడటం క్రీ. శ. పదకొండో శతాబ్దిలోనే జరిగింది. దీపశబ్ద భవమైన *దివియనుంచి ఏర్పడ్డ దివ్య (SII 4.1317.6,1081), దివ్య (AR 1933 AP. B. 56.7,1072) లు అనాటి శాసనాల్లో ఉన్నాయి. తిక్కన కవితలో ఈనాటి శబ్దాలున్నందువల్ల క్రీ. శ. పదమూడో శతాబ్దికి ఈ పరిణామం పూర్తయిందని భావించవచ్చు.
3.21. అచ్చుల హ్రస్వదీర్ఘతలు : ప్రథమాక్షరంలో హ్రస్వదీర్ఘాచ్చులుండి అర్థభేదం లేని జంటమాటలు కొన్ని శాసనభాషలో కనిపిస్తాయి. ఇవి రెండు రకాలు. (i) అక్షర సంఘటనలో ఇందువల్ల మార్పురానిని. ఉదా. ఎమ్భది (EI 30.69-71.4,699-700), ఏమ్బది (పై. 27.231-34.11,625-50). (ii) హ్రస్వాచ్చు మీద ద్విత్వహల్లు గాని దీర్ఘాచ్చుమీద అద్విరుక్త హల్లుగాని ఉన్నవి. ఉదా. జూవి (SII 10.217.745-801), జువ్వి (EI 5.127-31-31, 392-922). ద్వితీయాక్షరంలో హ్రస్వదీర్ఘ భేదముండి అర్థభేదం లేని