సరళాదిపదాలు రెండు రకాలు, పదాదిపరుషాలను సరళీకరించినందున ఏర్పడ్డవి ఒకరకం; వర్ణవ్యత్యయ కారణంగా నరళాదిపదాలైనవి రెండోరకం; వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడ్డవి మళ్ళీ రెండురకాలు : అద్విరుక్త సరళాదులు, సంయుకాక్షరాదులు. ప్రస్తుతం వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడ్డ అద్విరుక్తసరాళాది పదాల విషయం చూద్దాం.
3.8 వర్ణవ్యత్యయం : ప్రథమాక్షరం మీదనుంచి ద్వితీయాక్షరం మీదికి ఊనిక మారినందు వల్ల వర్ణవ్యత్యయం పురాణాంధ్రంలోనే ఏర్పడిందని కె. వి. నుబ్బియ్య (IA 209) వాదం. ఎల్. వి. రామస్వామి అయ్యర్ (QJMS 22 448-80), ఎం. బి. ఎమేనో (Lg. 31. 191-92)లు కూడా ఈ వాదాన్ని పరిశీలించారు. ఎ. మాస్టర్ ఈ ధ్వని పరిణామానికి "పోఎన్థెసిస్" (Proenthesis) అనే పేరు (BSOAS 12. 340-64) పెట్టారు. వర్ణవ్యత్యయంతో పాటు అచ్సంకోచం కూడా జరిగిందని భధ్రిరాజు కృష్ణమూర్తి (1961. 1.121-38) వివరించారు. ఈమార్పు(అ' హఅ2>హఅ2అ2హఆ) కారణంగానే తెలుగులో పదాదిన గ,డ,ద,వ,ర,ఱ,ల,ళఴ, కారాలుగల శబ్దాలు ఏర్పడ్డాయి. ఉదా గారి (భరతి 5.618.7,850), దగ్గుంబఱ్ఱి (IA 12.91-95.55,845-70),, దాని (కొ. వ. మం. 1.2-3.41, 898-934), వాన్ఱు (SII 10.606.18=19, 600-25), రెణ్డు. (EI 27.234-38.11, 625-50), ఱేని (భారతి 5.618.7,897), లేచి (పై. 473-84,848), ళోన (SII 10.628.8.9/10), అచ్చు (వై. 24. 12, 682). వీటిలో "గారి" అనేది వారి (NI 3.1151.4.650) నుంచి ఏర్పడ్డది. 'ళోన'కు పూర్వరూపమైన 'ఒళన' (అం వ 1941-42. 5-15.1, 600-25) శాసనభాషలోనే లభిస్తున్నది. "ఴచ్చు" కు పూర్వరూపమైన *అఴియు ధాతురూపాలు “అఱిసిన' (SII `10.25, 625-50) శాసనాల్లోనే ఉన్నాయి. ఈ మార్పు శాసనభాషాకాలానికి చాలా ముందుగానే పూర్తయిందని చెప్పవచ్చు.
3.9. పదాదిసంయుక్తాక్షరాలు : వర్ణన్యత్యయ, ఆచ్సంకోచాలవల్ల
పదాదిన ఏర్పడ్డ సంయుక్తాక్షరాలు క్రి. శ. 4/5 శతాబ్దినుంచీ శాసనభాషలో
క్రమంగా కనిపిస్తాయి. పదాది క్ఴ, ప్ఴ, న్ఱలు క్రమంగా క్ర, ప్ర, వ్ర,లుగా క్రీ. శ. . 7వ
శతాబ్టికే మారినట్టు చెప్పవచ్చు. ఉదా. క్టొచ్చె (5 27.988-40, 27,700.25):
క్రొచ్చె (SII 10.597.20-21); ప్ఴాన్దోఱంబు. (JAHRS