ప్రాచీనాంధ్రం: శాసనబాషాపరిణామం 55
త్రాగిన (పై. 644.106-7, 1060), ద్రోవది (భారతి 1948, 270-90; 369-75,66, 892-922), ప్రాలును (SII 4.1015.12,1084), బ్రమన (పై 1300.7,1095), మ్రాను (IA 7.185-91.13, 668-69), వ్రచ్చిన (SII 10,599.26, 625-50). ఴకారంతో సంయుక్తమైన క,పలు మాత్రమే పదాదిన కనివిస్తాయి, ఉదా. క్రొచ్చె (ఫై 601.27,700.25), ప్ఴోలనాండు (EI 18.58-60.14,732). క, గ, చ, జ, ట, త, ద, న, ప, బ, మ, య, ఱ, ల, ళ, వ, సలు అజ్మధ్యంలో ద్విరుక్తంగానూ అద్విరుక్తంగానూ కనిపిస్తాయి. ఇదిగాక ర, హ, ఴ, లు అద్విరుక్తంగానే ఉండేవి. రెండేసి హల్లులు కలిసిన సంయుక్తవర్ణాలు అజ్మధ్యంలో ఎక్కువగా ఉండేవి. మూడు హల్లులు కలిసినవి ఎరువు మాటల్లోకూడా చాలా తక్కువగా ఉండేవి.
3.6. తాలవ్యీకరణం : పదాదినర్ణాలు చరిత్రలో కొన్ని ముఖ్య పరిణామాలను మాత్రమే ప్రస్తావిస్తాం. తాలవ్యాచ్చులకు ముందున్న ప్రాచీన ద్రావిడ కకారం తెలుగులో చకారంగా మారటం సాధారణ లక్షణం. ఈ తాలవ్యీకరణం క్రీ. పూ. 300లకు క్రీ. శ. మొదటి కొద్ది శతాబ్దులకూ మధ్యకాలంలో జరిగి ఉంటుందని బరో (BSOAS, 11.122-39, ముఖ్యంగా 126), మూలద్రావిడంలోనే జరిగి ఉంటుందని కోరాడ రామకృష్ణయ్య (JVOI 16.76ff.), దక్షిణద్రావిడంనుంచి తెలుగు విడిపొయ్యేకాలంలోనో క్రీ. శ. 5వ శతాబ్దికి ముందుకాలంలోనో ఆరంభమై తెలుగులో సాహిత్యం ఏర్పడటానికి ముందున్న ప్రాచీనాంధ్ర కాలానికి పూర్తయి ఉంటుందని భద్రిరాజు కృష్ణమూర్తి (1961, 1.11-18) భావించారు. క్రి.శ. 395-410 నాటి పెదవేగిశాసనంలోని 'కమ్బురాఞ్చెరువు' (భారతి 1,110-22.15).'చెఞ్చెరువు' (పై 13-14) అనే మాటల్లోని 'చెఱువు' మూల ద్రావిడ శబ్దం *కెఱయ్ నుంచి ఏర్పడ్డది కాబట్టి, ఆనాటికే తాలవ్యీకరణం భాషలో స్థిరపడ్డదని చెప్పవచ్చు. 'కిరాత' శబ్దభవమైన “చిలాత” శబ్ధం (మెహందాళే 1948, పీఠిక 23, పే. 120,23, మొ.) క్రీ. శ. 8వ శతాద్దినాటి ఒక ప్రాకృతశాసనంలో (నాగార్జనకొండశాసనం EI.20.1-7,21.51-71) లభిస్తున్నది. పై శాసనాధారాలనుబట్టి ఈ ధ్వనిపరిణామం క్రీ. శ. నాలుగోశతాబ్దంలో మధ్యాంధ్ర దేశంలో మొదలైందని చెప్పాలి. ఆయితే క్రీ. శ. ఎనిమిదో శతాబ్దంవరకూ “చేయు” ధాతువు పూర్వరూప మైన “కేయు” రూపాలు లేఖనంలో కనిపిస్తున్నాయి. భీమునిపట్నం తాలూకా