ఈ పుట అచ్చుదిద్దబడ్డది
50. తెలుగు భాషా చరిత్ర
(ii) గోండీ కీమ్ కీమ్‌ట్ తెలుగు చేయము చేయండు పై ఉదాహరణలని పరిశీలిస్తే తెలుగులో బహువచన ప్రత్యయమైన -(ఉ)oడు *-(ఉ) మ్-ట్ నించి మకారం పరంగా ఉన్న టకారం వల్ల మూర్థన్యణకారంగా మారి అనునాసికం తరవాత ఉన్న టకారం నాదమైన డకారంగా మారడంవల్ల ఏర్పడిందని స్పష్టమవుతుంది. గోండీలో-మ్‌ట్ అచ్చుతో ఆంతమయ్యే ఏకాచ్క ధాతువుల తరవాత మాత్రమే ఉంటుంది. కాని కోయలో-మూటు అచ్చుతోనూ, అద్విరుక్త హల్లుతోనూ అంతమయ్యే అన్ని ధాతువుల తరవాతా ఉంటుంది. (సుబ్రహ్మణ్యం 1968, && 4, 9, 7, 4, 8.) దీని వల్ల తెలుగు, తమిళం, కోత, కన్నడంలో లాగా మొదట్లో మకారమే బహువచన ప్రత్యయంగా ఉండేదనీ తరవాత కాలంలో దానికి టకారం చేరిందనీ మనం ఊహించవచ్చు. మొదట్లో బహువచన ప్రత్యయమైన మకారం ఏకవచన ప్రత్యయంగా మారడం, బహువచన రూపంలో ట కారం కొత్తగా చేరడం-ఈ రెండు మార్పులు తెలుగు, గోండీ, కొండ, కూయి, కువిలలో తుల్యంగా ఉండడం వల్ల ఈ భాషలన్నీ పూర్వకాలంలో ఒకే భాషగా ఉండేవని మనం నిర్ణయించవచ్చు. ఉపసంహారం 2.54. మూలద్రావిడ భాషకాలం నించి తెలుగు ప్రత్యేకభావగా రూపొందే వరకూ ఎటువంటి మార్పులు పొందుతూ వచ్చిందో మనం ఇంతవరకూ చూశాం. తెలుగు పొందిన ఈ పరిణామాలు చాలా వరకు మధ్య ద్రావిడభాషలలో కూడా ఏర్పడి ఉండడం వల్ల తెలుగు మధ్య దావిడోపకుటుంచానికి చెందినదని తెలుస్తుంది. ఇక మధ్య ద్రావిడోపకుటుంబంలో కోలామీ, నాయకీ, పర్జీ, గదబ - ఈ నాలుగు భాషలూ పరస్పర సన్నిహితత్వంలో ఒక చిన్న ఉపకుటుంబం (కోలామీ-పర్జీ) గానూ (చూ. ఎమెనో 1955, అధ్యాయం 10), తెలుగు, గోండి, కొండ, పెంగొ, మండ- కూయి, కువి భాషలు ఇంకొక చిన్న ఉపకుటుంబం (తెలుగు - కూయి) గానూ ఉన్నాయి. తెలుగుకీ *గోండీ, కూయి మొదలైన భాషలకి 1. వర్ణవ్యత్యయం (2.13). 2. యుష్మదస్మదర్థక సర్వనామాల ఔపవిభక్తిక రూపాల పరిణామం (2.38-39.), 3. విధ్యర్థక రూపాల పరిణామం (2.53) ఆనే మూడు