Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

    భాషా సముదాయం వల్ల తెలుస్తుంది. వీటిలో-ఇ-/-ఇన్‌- హ్రస్వాచ్చు గల ఏకాచ్చ క్రియలు కాకుండా ఉండి స్పర్శంతో అంతమయ్యే క్రియల తరవాత, మిగిలిన మూడు ప్రత్యయాలూ మిగిలిన క్రియల తరవాతా వచ్చేవి. తెలుగులో ఈ నాలుగు ప్రత్యయాలూ ఐక్యం పొంది -ఇతి- ఏర్పడింది. దీని సపదాంశమైన -టి- నకారాంత ధాతువుల తరవాత వస్తుంది. తెలుగులో తిం-టి-ని, కౌం-టి-ని తమిళంలో తిన్‌-ఱ్-ఏన్‌, కొణ్-ట్‌-ఏన్‌తో పోలిస్తే వీటిలో -౦ట్‌- *-న్ఱ్, *-ణ్ట్ - అనే- రెండింటి నించి వచ్చిందని తెలుస్తుంది. మూల ద్రావిడంలో                                                                
                                                                              /  \    /   \
                                                                              |     |    |  న్  |
                                                                              | ఱ్ |     |      |-
                                                                              |     |    |  ల్  | 
                                             త్                →             |     | / |      |      
                                                                              |     |     | ణ్  |
                                                                              |ట్   |    |      |-
                                                                               \  /    |  ళ్  |
                                                                                         \   /
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         
                                                                         

అనే సంధిసూత్రం ఉండడం వల్ల వీటిలో ఱ్, ట్‌లు -త్‌- రూపాంతరాలే. *-న్ఱ్-, * -ణ్ట్-తెలుగులో -ండ్‌- అవ్వాలి (2.22). కాబట్టి పై వాటిలో ఉండవలసిన డ కారం ట కారంగా -ఇతి-లో శ్వాసమైన తకారం ప్రభావం వల్ల మారిందనిఎమెనో(1967 : 388) అభిప్రాయం

     తెలుగులో -ఇతి-, -టి-ఉత్తమ మధ్యమ పురుష ప్రత్యయాల ముందే వస్తాయి. ప్రథమ పురుషలో మహత్‌ ప్రత్యయమైన రి ముందు ఇ, మిగిలిన చోట్ల ఎను ఉంటాయి. ఎనుకి కొన్ని క్రియల్లో ఇయెను అనే రూపాంతరం కూడా ఉంది. (బా. వ్యా. క్రియా. 50). కాబట్టి ఇది ఇ, అన్‌ అనే రెండు భూతకాలిక ప్రత్యయాల సముదాయమని ఊహించవచ్చు. అనియెను, అనెను మొదలైన వాటిలో 'ఇయెను' ఏ ప్రాచీనమైన మల్లియ < మల్లె, కన్నియ < కన్నెలోలాగా అది 'ఎను' గా తరవాత కాలంలో మారి ఉండవచ్చు. మూలద్రావిడంలో నాలుగు ప్రత్యయాలకి బదులు ఒకే ప్రత్యయం ప్రచురంగా ఉండడం తెలుగులోనూ, గోండీ కోలామీ మొదలైన కొన్ని మధ్య ద్రావిడ భాషల్లోనూ తుల్యంగా ఉంది.
                                                                      
2.45. భావికాలిక ప్రత్యయాలు. తెలుగులో -దు-/-ఎద-.. ఉత్తమ మధ్యమ పురుష ప్రత్యయాల ముందూ, ప్రథమ పురుషలో మహత్‌ బహువచన ప్రత్యయం ముందూ వస్తుంది. ప్రాచీన తమిళంలో -త్‌- అనే భావికాలిక