ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తొమ్మండుగురు దీనిబదులు - గురు కూడా ఉంటుంది. కాని దశగుణ సంఖ్యలలోనూ, పధ్నాలుగు తరవాతా - గురు ఇప్పటి భాషలో ఉండదు (ప్రాచీన భాషలో 'పదుగురు' ఉంది), రాయలసీమ మాండలికంలో ఐదు, ఆరు, ఏడులకి కూడా “మంది” చేర్చి వ్యవహరిస్తారు.
పూరణ సంఖ్యలు ప్రాథమిక సంఖ్యా పదాలకి - అగున్/-అ వున్/- ఆవ (వ్యా -ఓ) చేర్చడంవల్ల ఏర్పడతాయి: రెండగున్/రెండో. ఇది నిజానికి 'అగు' ధాతువు తద్ధర్మార్థక ధాతుజవిశేషణ రూపమే. ఇది త.మ. - ఆవతు/- ఆం (ఇరంటాం), క.తు - అనెయ (క. ఎరడనెయ) 'రెండో' ప్రత్యయాలకి సంబంధించినదే.
క్రియలు 2.43. ప్రేరణ ప్రత్యయాలు. తెలుగులో 'చు', 'పు', 'ఇందు'- ఈ మూడూ ప్రేరణ ప్రత్యయాలు, '-చు' కన్నడం -చు (-ఇసు)-, గోండీ ఊన్-, కూయి -న్ మొదలైన వాటికి సంబంధించినది. ఈ ప్రత్యయం తమిళమలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉంది. -పు ప్రత్యయం కూడా చాలా ద్రావిడ భాషల్లో ఉంది. (తె. త్రిప్పు : త. తిరుప్పు). - ఇంచు ప్రత్యయం ఇ. చు అనే రెండు ప్రేరణార్థకాల సముదాయం కావచ్చు. ఇకారం ప్రేరణార్థకంగా తమిళం “వి” (చెయ్‌వి “చేయించు”, “ప్పి” (నటప్పి. 'నడపు”) లలో వకార పకారాలతో కలిసి ఉంది. మూలద్రావిడంలో అద్విరుక్తస్పర్శంతో (దాని మందు అనునాసికం ఉన్నా లేకపోయినా) అంతమయ్యే కొన్నిక్రియలలో దాని స్థానంలో ద్విరుక్తస్పర్శాన్ని (దీనిముందు అనునాసికం నశిస్తుంది), ఆదేశం చెయ్యడంవల్ల కూడా ప్రేరణ క్రియలు ఏర్పడేవి (త. ఆటు 'ఆడు"-ఆట్టు "ఆడించు : కలంకు “కలఁగు" : కలక్కు- కలఁచు”). ఈ ప్రక్రియ నేటికీ తమిళం, మళయాళం, కోత, తొద, కొడగు, కొండ, కూయి, కువి, పెంగొ, మండ భాషల్లో నిలిచి ఉంది. తెలుగులోనూ ఇతర భాషల్లోనూ ఇది నశించింది (దీనిపై వివరాలకి చూ. సుబ్రహ్మణ్యం 1965, 1977, 300-331). 2.44. భూతకాలిక ప్రత్యయాలు.మూలద్రావిడంలో “-త్-,-న్త్-,-త్త్-,-ఇ-/-ఇన్-” అనే నాలుగు భూతకాలిక ప్రత్యయాలు ఉన్నట్లు తమిళం-కొడగు