పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

తెలుగులోనూ ఇతర మధ్య ద్రావిడ భాషల్లోనూ కూడా జరిగింది. కాబట్టి ఇది తెలుగు మధ్య ద్రావిడ భాష అని నిర్ణయించడానికి ఒక ముఖ్యాధారం.

2.42.  సంఖ్యాపదాలు. ద్రావిడ భాషలలో ఒకటి నించి పది వరకూ, 100 కీ. 1000 కీ. (తెలుగులో మాత్రం) ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. 20,30 మొదలైన దశగుణ సంఖ్యలకి పదాలు 10 రూపానికి 2,3,4 మొదలైన వాటి విశేషణ రూపాలు ముందు చేర్చడం వల్ల ఏర్పడతాయి. పది పైన ఉండే అంకెలు (సున్న ఉన్నవి కాక మిగిలినవి) సున్న ఉన్న అంకె తరవాత 1,2,3 మొదలైన వాటి పదాలు చేర్చడం వల్ల ఏర్పడతాయి. త. మ. ఆయిరం, క. సావిర. సాసిర, తా. సోఫెర్‌ సంస్కృతం సహస్ర '1000' నించి వచ్చినవి కాని తెలుగు 'వేయి, వెయ్యి' మాత్రం ద్రావిడ పదమే. లక్ష, కోటి అనే సంస్కృత పదాలే నాలుగు సాహిత్యవంతమైన భాషలలోనూ ఆ సంఖ్యలని సూచించడానికి ఉపయోగిస్తారు. 
                                                                    
   తెలుగులో ప్రాథమిక సంఖ్యాపదాలూ, వాటి మూలరూపాలూ 1. ఒండు < * ఒన్ఱ్, ఒక్కండు, ఒకండు, ఒకటి య < * ఒర్‌-, 2. రెండు < * ఇరంట్‌, 3. మూడు < మూన్ఱ్, 4. నాలుగు < * నాల్‌, 5. ఏను, ఐదు (<క.) < * చయ్‌- (న్‌త్), 6. ఆఱు, < * చాఱ్ఱ్, 7. ఏడు < * ఏఱ్, 8. ఎనిమిది (శా. ఎణుంబొది) < * ఎణ్, 9. తొమ్మిది < * తొణ్‌ (8,9లలో మిది < పది), 10. పది < * పత్త్‌ (* పతిన్ -దీని ఔపవిభకిక రూపం-ఇదే తెలుగులో ప్రథమా రూపంగా మారింది. 100. నూఱు < * నూఱ్ (వంద సం. బృందశబ్దభవమని అంటారు) 1000. వేయి, వెయ్యి < * వయ్‌- (దీనిపై వివరాలకి చూ. సుబ్రహ్మణ్యం 1977; 220-231).                                       
                                                                 
    తెలుగులోనూ. ఇతర భాషలలోనూ మనుష్య వాచక సంఖ్యా పదాలు ప్రాథమిక సంఖ్యా పదధాతువుకి ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడతాయి. తెలుగులో ఈ ప్రత్యయ రూపాలు- రు (ఒకరు, ఒక్కరు, ఎనమండ్రు, -తొమ్మండ్రు, పదుండ్రు- దఱు (ఇద్దఱులో మాత్రం), -వురు/- గురు (మూవురు, మువ్వురు, ముగ్గుకు, నలువురు, నల్వురు, నలుగురు, మొ) -వురు/-గురు త. మ. క. - వర్‌కు సంబంధించినది - త. మ. మూవర్‌, క. మూవరు, ముగ్గురు, మొ. ఆధునిక భాషలో 'ఎనిమిది' కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో 'మంది' (క. మంది) చేరుతుంది; ఎనిమిదిమంది/ ఎనమండుగురు, తొమ్మిది మంది/