ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40. తెలుగు భాషా చరిత్ర
వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడిన నా-, మా-, నీ-, మీ-, అనే యుష్మదస్మదర్థ కాల ఔపవిభక్తిక రూపాలు తెలుగు, గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువి అనే భాషలు అన్నింటిలోనూ సమానంగా ఉన్నాయి. కాబట్టి వీటిలో ఈ వర్ణవ్యత్యయం ఈ భాషలన్నీ ఒకే భాషగా ఉన్న కాలంలో జరిగి ఉంటుందని ఊహించవచ్చు. గోండీ, కూయిలలో కొన్ని మాండలికాల్లోనూ కొండ, కువిలలోనూ కూడా తెలుగులో లాగా ఔపవిభక్తిక రూపాల ప్రభావం వల్ల నామవాచక రూపాల మొదట న కార మ కారాలు చేరడమనే మార్చు కనపడుతోంది. (యుష్మదస్మ దీర్ఘకాల పరిణామం సమగ్ర చర్చకి (చూ. కృష్ణమూర్తి 1968 a, సుబ్రహ్మణ్యం 1969 a). [(కృష్ణమూర్తి (1961 : 268)] *అవన్ఱ్ ఏ మూల ద్రావిడ రూపమని చెప్పారు. బరో కూడా *అవన్ట్ ఏ మూల ద్రావిడ రూవమని *అవన్- దాని ఔపవిభక్తిక రూపమనీ, ఈ ఔపవిభక్తిక రూపమే దక్షిణ భాషలలో ప్రథమా విభక్తిలో కూడా సామ్యం వల్ల ప్రవేశించిందనీ వివరించారు. ఈ రెండో అభిప్రాయమే ఎక్కువ యుక్తి యుక్తగా ఉంది. 2.40. ఉభయార్థకం. మూల ద్రావిడంలో ఉభయార్థక సర్వనామం *నామ్, దీని ఔపవిభక్తిక రూపం *నమ్-, తెలుగులో మా-, మీ-, అనే మ కారాదులై న యుషస్మద్మ దీర్ఘకాల ఔపవిభక్తిక రూపాల ప్రభావం వల్ల దీనిలో కూడా వర్ణవ్యత్యయం సంభవించి *నమ, మనగా మారి ఉండవచ్చు. తెలుగు 'మనకు' ని తమిళం 'నమక్కు' తో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీని చివర బహుత్వ సూచకమైన 'ము' చేరి 'మనము' అనే ప్రథమా రూపం సిద్ధించి ఉండవచ్చు. 2.41. మహదేకవచన సర్వనామం. తెలుగు వాఁడు, కో. అమ్డ్/అవ్‌న్ద్, ప. ఓద్/ఓడ్, కొండ వాన్ఱు, కూయి, అఅంజు. కువి అఅసి-వీటికి మూలమధ్య ద్రావిడంలో మూలరూపం *ఆవన్ఱ్, దక్షిణ ద్రావిడభాషల్లో దానికి సమానపదం *అవన్. ఇదే మూల ద్రావిడ రూపం కూడా అయి ఉండవచ్చు: మూలమధ్య ద్రావిడభాష కాలంలో మూ. ద్రా. *అవన్ చివర ఒక తకారం చేరి అది *అవన్ఱ్ గా మారింది. (దంత్య తకారం దంతమూలీయన కారం తరవాత దంతమూలీయ ఱ కారంగా మారుతుంది.) అమహదేకవచన సర్వనామమైన *అత్ (తె. అది) చివర తకార ముండడం వల్ల మధ్య ద్రావిడంలో *ఆవన్‌కి కూడ చివర తకారం చేరి అది *అవన్ఱ్ గా మారి ఉండవచ్చునని ఎమెనో (1955, $ 10.15) ఊహించేరు. ఈ పరిణామం