పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు

తప్ప మేము ఆనే రూపం అసలే లేదు. కాబట్టి ఏను, ఏము-, వీటి ఔపవిభక్తిక రూపాలైన నా-, మా-, ల ప్రభావం వల్ల న కార మ కారాలు వీటి ముందు చేరడం వల్ల ఇవి నేను, మేముగా తరవాత కాలంలో మారాయని ఊహించవచ్చు.

2.39. యుష్మదర్ధక సర్వనామాలు. నీవు, ఈవు, మూ. ద్రా. *నీన్‌ నించి వచ్చినవి. ఈరు, మీరు, ఈరలు, మీరలు, మూ. ద్రా. * నీమ్‌/* సీర్‌ నించి వచ్చినవి. వీటి ఔపవిభక్తిక రూపాలు నిన్‌-/నీ-, మిమ్‌-/మీ- (వీటిలో మొదటిది ద్వితీయా విభక్తి అయిన -ఉన్‌, ముందు, రెండోది మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). వీటి మూ. ద్రా. రూపాలు *నిన్‌-, *నిమ్‌-, వీటిలో పదాది న కారం మూలమధ్య ద్రావిడంలోనే లోపించి ఇవి *ఇన్‌-, *ఇమ్‌-గా మారాయి. ఈ రూపాలు కోలామీ-పర్జీ భాషలలో నేటికి ఇలాగే నిలిచి ఉన్నాయి. అస్మదర్థక రూపాలకి మల్లేనే ఇవి కూడా చతుర్ధీ, షష్టీ విభక్తులలో వర్ణవ్యత్యయం పొందడం వల్ల నీకు, నీదు, మీకు, మీదు, అనే రూపాలు ఏర్పడ్డాయి. వీటిలో ఉన్న నీ-, మీ-, ల ప్రభావం వల్ల ద్వితీయా విభక్తి ముందు ఉన్న ఇన్‌-, ఇమ్‌-, లు నిన్‌-, మిమ్‌-, లుగా మారాయి.

    *నీన్‌ లో పదాది న కారం అన్ని మధ్య ద్రావిడ భాషల్లోనూ, అంత్య న కారం తమిళం, మళయాళం, కోత, తొద, తెలుగు, బ్రాహుయీలలోనూ లోపించాయి. ఈ రెండు నకారాలూ పోగా మిగిలిన 'ఈ' చివర హల్లు లేని ఏకాక్ష పదం కాబట్టి దీని చివర 'వు' చేరి ఈవు గా మారింది. ఆవు (< *ఆ), పూవు (*పూ) మొదలైన పదాల్లో కూడా ఇటువంటి మార్పే  జరిగింది. ఔపవిభక్తికమైన నీ- ప్రభావం వల్ల పదాదిని న కారం చేరి ఈవు నీవుగా మారింది. 
                                                              
      మూలద్రావిడంలో యుష్మదర్ధక బహువచన రూపం *నీమ్‌. దానిలో బహువచన ప్రత్యయమైన మకారం స్థానాన్ని దాని కన్న విశేషవ్యాప్తిలో ఉన్న మనుష్య వాచక బహువచన ప్రత్యయమైన రేఫ ఆక్రమించుకోడం వలన ఏర్పడిన *నీర్‌ అనే మరొక రూపం మూల ద్రావిడ భాష కాలంలోనే సృష్టించబడింది. తమిళంలో నీర్‌, నీయిర్‌, తుళు, ఈరు, తెలుగులో ఈరు, కూయి, ఈరు, నీర్‌, అనే రూపం నించి వచ్చినవే. తుళు, తెలుగు, కూయి, ఈరు, *నీర్‌ అనే రూపం నుంచి వచ్చినవే. తుళు, తెలుగు, కూయి, ఈరు, *నీర్ లో పదాది న కారం లోపించడం వల్ల ఏర్పడింది. తెలుగులో దీనికి ఔపవిభక్తికమైన మీ- ప్రభావం వల్ల పదాదిని మకారం చేరి మీరు ఏర్పడింది. ఈరలు, మీరలు, ఈరు, మీరులకు మళ్ళీ బహువచన ప్రత్యయమై 'లు' చేరగా ఏర్పడినవి.