36. తెలుగు భాషా చరిత్ర
2.35. బహువచన ప్రత్యయాలు. ప్రాచీనాంధ్రంలో కొన్ని మహన్మహతీ వాచకాలలో రు (ఱు) బహువచన ప్రత్యయంగా ఉంది. (బా. వ్యా, అచ్ఛిక. -7, 10-11), ఉదా : పగతురు, అల్లురు, విలుకాండ్రు/విలుకాఱు, కోడండ్రు, మీరు, వారు, అందఱు, కొందఱు ఎవ్వరు. ఇది ఇప్పటి వ్యవహారిక భాషలో సర్వనామాల్లోనూ, ఇద్దరు, ముగ్గురు మొదలైన సంఖ్యా వాచకాల్లోనూ మాత్రమే మిగిలి ఉంది. ఇది మూ. ద్రా. లో మనుష్య వాచక శబ్దాలలో బహువచన ప్రత్యయమైన * - (అ)ర్ నించి వచ్చినది. మిగిలిన అన్ని నామవాచకాలలోనూ బహువచన ప్రత్యయం 'లు' (ప్రాచీన శాసనాలలో 'సంవత్సరంబుళ్' మొదలైన పదాల వల్ల ఇది మొదట్లో మూర్ధన్య ళ కారమని తెలుస్తుంది.) తుళులోనూ, కోలామీ, నాయకీ, పర్జీ, గ, ద, బ, లలోనూ *కళ్, *ళ్ అనే రెండు ప్రత్యయాల నించి వచ్చిన ప్రత్యయాలు ఉండటం వల్ల మూ. ద్రా. లో కొన్నింటిలో *కళ్, మరి కొన్నింటిలో *ళ్ ఉండేనని మనం చెప్పవచ్చు. తెలుగులో కూడా ఏనుగు-లు (త. యానై-కళ్), మ్రాకులు (త. మరం-కళ్). చిలుక-లు (త. కిళి-కళ్), ఎలుక-లు (త. ఎలి-కళ్) మొదలైన పదాల్లో బహువవచన ప్రత్యయం *లు' గానే కనిపిస్తున్నప్పటికీ వీటిని తమిళంలో సమాన రూపాలతో పోల్చి చూస్తే వీటితో మొదట్లో బహువచన ప్రత్యయం 'లు' గానే కనిపిస్తున్నప్పటికీ వీటిని తమిళంలో సమాన రూపాలతో పోల్చి చూస్తే వీటితో మొదట్లో బహువచన ప్రత్యయం 'కళ్' ఏనని 'లు' బహువచన ప్రత్యయమని భ్రమించి, దీని ముందున్న క,గ లు ప్రాతిపదికతో చేర్చబడడమనే అనుచిత విభాగం జరిగి ఉంటుందని కాల్డ్ వెల్ (1956 : 245) చేప్పేరు.
తెలుగులోనూ మిగిలిన మధ్య ద్రావిడ భాషలలోనూ బహువచన ప్రత్యయం నిత్యమైనది. అంటే బహుత్వాన్ని ఉద్దేశించినప్పడు. బహువచన ప్రత్యయాన్ని తప్పకుండా వాడాలి. కాని దక్షిణ ద్రావిడ భాషల్లోనూ, ఉత్తర ద్రావిడ భాషల్లోనూ అలా కాదు. “రెండు చెట్లు” అనడానికి తమిళంలో “ఇరంటు మరం”, కన్నడంలో “ఎరడు మర” అని బహువచన పత్యయం (త, కళ్, క. గళు) లేకుండానే అనవచ్చు. కూడుఖ్, మాల్తోలలో అసలు బహువచన ప్రత్యయమనేదే లేదు. బ్రాహుయీలో - క్ (-ఆక్) అనే బహువచన ప్రత్యయం ఉన్నా దీనిని సందేహం కలిగే చోట్ల తప్ప మిగతాచోట్ల వాడరు. కాబట్టి దకిణ ద్రావిడభాషల్లోనూ, ఉత్తర ద్రావిడ భాషల్లోనూ బహువచన ప్రత్యయం వైకల్పికం. అందుచేత మూ.ద్రా. లో వైకల్పికమైన బహువచన ప్రత్యయం తెలుగులోనూ మిగిలిన