Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు

        తె. చెవి, చెవుడు : త. మ. చెవి, చెవిటు, క. కివి, కివుడు, కో.             
            నా. కెవ్‌ (1645).                                      
                                                                 
    పదమధ్యంలో మూలభాషలో అసంయుక్తమైన మూల *కకారం తెలుగులో కొన్ని పదాల్లో వైకల్పికంగా వకార మవుతుంది. (బా. వ్యా. ఆచ్ఛిక. 27). 
                                                                          
       తె. పగలు/పవలు (త. మ. పకల్, 3151),                             
       తె. నగు, నవ్వు (త. మ. నకు, క. నగు, 2944).                                   
    మరికొన్ని పదాల్లో మూల *వ కారం గకారంగా మారడం కూడా ఉంది.                            
       తె. మూవురు/ముగ్గురు (త. మ. మూవర్‌, 4147).                             
           నలువురు/నలుగురు (త. మ. నాల్‌వర్‌, 3024)                    
                                                                       
2.32.  తె. స < * చ 
       తె. సుడి : త. మ. చుఱి, క. సుఱి, తు. సుళి (2223).
       తె. సొఱ, చొఱ : త. మ. చుఱా, క. చొఱ (2234)
                                                                     
2.33. హత్తు (త. మ. పఱ్ఱు, క. పత్తు, హత్తు, (3320),హెచ్చు (క. పెర్చు, పెచ్చు, హెచ్చు, (3613) వీటిలో కన్నడంలో లాగా * ప కారం హ కారంగా మారింది  కాబట్టి ఇవి కన్నడం నించి ఎరువు తెచ్చుకున్నవి అయి ఉండాలి. తెలుగు దేశ్యపదాలల్లో హ కారం వీటిల్లో తప్న ఇంకెక్కడా లేదు.                                                               
                                                                
                           నామవాచకాలు
2.34.  లింగభేదం. తెలుగులో లింగభేదం ఏకవచనంలో మహత్తు (వాఁడు).   అమహత్తు (ఆది), బహువచనంలో మనుష్యవాచకాలు (వారు), అమనువ్యవాచకాలు (ఆవి) -- ఇలా ఉంటుంది. తెలుగుతో దగ్గిర సంబంధం లేని కూడుఖ్‌ -- మాల్తో భాషలలో కూడా ఇటువంటి లింగభేదమే ఉండటం వల్లా, దక్షిణ ద్రావిడభాషలలో స్త్రీ వాచక ప్రత్యయమైన-ఆళ్ మొదట్లో ప్రత్యేక శబ్దమైనందు వల్లా (కృష్ణమూర్తి, 1961, 4.32) తెలుగు, కురఖ్-మాల్తోలలో ఉన్న లింగభేదమే మూలద్రావిడంలో ఉండేదని పండితుల అభిప్రాయం.  (ఎమెనో 1955, - 10.17). కాబట్టి ఈ విషయంలో తెలుగు మూల ద్రావిడంలో స్థితిని యథాతథంగా నిలుపుకుంది అని చెప్పాలి. మిగిలిన మధ్య ద్రావిడభాషలలో బహువచనంలో కూడా ఏకనచనంలో లాగా మహదమహద్భేదమే ఊంది. ఇది ఆ భాషలలో అర్వాచీన పరిణామం కావచ్చు. ఈ సందర్భంలో ఆమె/ఆవిడ అనే స్త్రీ వాచక పదాలు ఆర్వాచీనాలని గమనించాలి.