ఈ పుట అచ్చుదిద్దబడ్డది
33. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు
తెలుగు ఈఁదు (త,. నీంతు. 3304), ఈవు (త. నీ, క. నీను, 5051). ఈరు (త. నీరు, 3055) మొదలైన కొద్ది మాటల్లో పదాది నకారం లోపిస్తుంది. ఈ మార్పు మిగిలిన భాషల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. 2.26. (i) తె. మ < * మ తె. మన్ను : త. మ. క. మణ్ (3817). తె. మేయు : త. మ. క. తు. గోం. ప. మేయ్ (4179). (ii) తె. మ < * మ, * -ంబ - తె. ఇనుము : త. మ. ఇరుంపు (411). తె. ఎడము : త, మ. ఇటం, క, ఎడ (368). తె. కొమ్ము, కొమ్మ : త. మ. కొంపు, క. తు. కొంబు (1759). తె. నమ్ము : త. మ. నంపు, క. నంబు (2975). తె. పాము : త. మ. పాంపు, క. పావు, తు, హావు (3361). 2.27. (i) తె. య < * య తె. కోయు : తు. మ. క. కొ. కొండ, ప. కొయ్- (1763). తె. మేయు : త. మ. క. తు. గోం. ప. మేయ్- (4179). తెలుగులో పదాదిన య కారం ఉండదు. 2.28. (i) తె. ర < * ర తె. రెండు : త. ఇరంటు, మ. రంటు, క. ఎరడు, ప. ఇర్డు (401) తె. పేరు : త. మ. పెయర్, పేర్, క. పెసర్, కో. నా. పేర్ (3612). తె. వేరు :త. మ. కోత. వేర్, క. బేర్, కో. నా. వేర్ (4554). తెలుగులో పదాది రేఫం ఎప్పుడూ వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది. (ii) తె. ర < * ఱ ఈ మార్పు వర్ణవ్యత్యయం వల్ల ఱ కారం పదాది హల్లుకి తరవాత వచ్చినపుడే జరుగుతుంది (చూ. 2.13). (3)