పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

462 తెలుగు భాషా చరిత్ర

(< *ర, ట, ఴ) లోపించటం 10, 11 శతాబ్దుల్లో మొదలైంది. గొచ్చి (10 శతా.), మాని (కీ. శ. 1062). కాని కావ్యభాషా ప్రభావంవల్ల ఈ మార్పు మొదట విరళంగానే కనిపిస్తుంది(§ 8.9). 14వ శతాబ్ది తరవాత 'రావడి' లేని రూపాలు విరివిగా శాసనభాషలో దొరుకుతాయి. ఉదా. కొత్త, కింద (§§ 4. 16, 5.13, 6.14). ఇప్పటికీ క్రొత్త, క్రిందలాటి శబ్దాలు రచనలో ఉండటం కావ్య భాషా ప్రభావంవల్లనే అని గుర్తించాలి. సంయుక్త హల్లుల్లో మొదటి వర్ణం వకారమై, ర పరంగా వచ్చిన అచ్చు 'ఆ' అయినప్పుడు, వకారమే లోపిస్తుంది. ప్రాక్తెలుగు

  • వరాదు > రాదు; వ్రాయ > రాయు.

(17) డ > ద |#_

పదాది డకారం (> *ట, *ఴ) 11వ శతాబ్దికి ముందే డకారంగా మారింది. ఉదా. దున్ను (క్రీ.శ. 1314), డున్ను (క్రీ.శ. 1218) (§ 4.9), దగ్గర, దొంగ, దాగు, దంచు, మొ. శబ్దాల్లో ఉన్న 'ద'కు పూర్వరూపం డ. ఈ సూత్రానికి డెబ్బది > డెబ్బై అపవాదం. నన్నయ నన్నెచోడుల రచనల్లో రెండు రూపాలు కనిపిస్తాయి. (§ 7.8).

(18) (a) ఇయ > ఎ / # . . . _ #

(b) ఎ > ఇ / # . . . _ #

కొన్ని నామపదాల్లో ప్రథమేతరాక్షరాల్లో (సామాన్యంగా పదం చివర) వచ్చే ఇయ, 'ఎ'గా మారుతుంది; ఉదా నూనియ > నూనె (క్రీ.శ. 1600) > నూని, గొఱియ > గొఱె|గొఱ్ఱె > గొఱి (క్రీ.శ. 1600) (§ 6.8(e)). 14, 15 శతాబ్దులవరకు మధ్యాంధ్ర౦లో 'ఎ'అని ఉన్నప్పుడు, శ్రీకాకుళం, విశాఖల్లో 'నూన్య, చెల్యలు' అనిరాసేవారు (§ 4.60). ఇక్కడి 'య' బహుశా వివృతమైన 'ఎ'కారానికి గుర్తేమో ! ఇప్పుడు మనం పళ్ ళేలు అని ఉచ్చరించే మాటను శాసనాల్లో పళ్యాలుఅని రాశారు. (§5.7). 'ఇయ' కు 'య' ఆదేశ౦గా రావటం 11, 12 శతాబ్ధుల్లోనే కనిపిస్తుంది. దివియ > దివ్య (క్రీ.శ. 1081) (§ 8.20). 17వ శతాబ్టినుంచి 'ఎ/ఇ'లే ప్రాచీన 'ఇయ' స్థానంలో వస్తాయి. వివృతాచ్చు రూపాలు ('ఎ'తో ఉన్నవి) దక్షిణా౦ధ్ర౦లోను, సంవృతాచ్చు ('ఇ') తో ఉన్నవి ఉత్తరప్రా౦తంలోను కనిపిస్తాయి (§ 5.7). ఇప్పుడుగూడా మధ్యాంధ్ర౦లో గిన్నె, గొొర్రె, గంటె, మొ. మాటలకు సరిగా శ్రీకాకుళం విశాఖపట్నం మాండలికంలో గిన్ని, గొర్రి, గంటి అనే ఉచ్చారణలు నియతంగా వినిపిస్తాయి.