Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషా చరిత్ర : సింహావలోకనం 461

(12) న్ఴ > ణ్డ

ఉదా. కొన్ఴూరి (క్రీ. శ. 700), తాన్ఴి కొన్ఴ (క్రీ. శ. 395-410); కొకొణ్డ (క్రీ. శ. 742-98), ఇక్కడి 'ఴ' వర్ణ౦ చారిత్రకంగా దంతమూలీయ 'డ' వర్ణం.

(13) Ø > డ/న - ర

సంధివశాన న-రల సంయోగం వచ్చినపుడు వాటిమధ్య అంతకుముందులేని 'డ' ఉచ్చారణ సౌలభ్యానికి చేరుతుంది: పండ్రె౦డు (క్రీ. శ. 625-50), వాణ్డుృ (క్రీ. శ. 1084). వీటి పూర్వరూపాలు *పన్‌_.రెండు, వాన్‌-రు అయిఉండాలి.

(14) ౦ > c / # ' ...అ' అ - హ

దీర్ఘాచ్చు పైన, అపదాది హ్రస్వాచ్చుపైన వచ్చే అనుస్వారం (వర్గానునాసికం) అనునాసిక్యం (nasalization) గా మారుతుంది. ఈ మార్పు 18వ శతాబ్ధినుంచి కనిపిస్తుంది. (§§ 3.22-23). లేఖన చిహ్నంగా అర్థానుస్వారం చాలా ఇటీవలిది. అనుస్వారం వర్గానునాసికాల స్థానంలో రాసే అలవాటు క్రీ. శ. నాలుగు శతాబ్దిలో మొదలై 12వ శతాబ్దికల్లా స్థిరపడ్డది. నిండు సున్నకు అనునాసికోచ్చారణ ఉన్నచోట పరహల్లును ద్విరుక్తంగాను అర్థానుస్వార (ఆనునాసిక్య) ఉచ్చారణ ఉన్నచోట అద్విరుక్తంగాను రాసే వాడుక వాటి పరస్పర భేద సూచకమైంది, ఉదా. సుంక్కము (క్రీ. శ. 1600), తోంటలు (క్రీ. శ. 1604). ఈ సంప్రదాయం 17వ శతాబ్దికి స్థిరరూపం పొందింది (§ 6.15).

(15) - క - - గ - | చ > స / # ప్రథమావిభక్త్యఁత త > ద / పదం # _ - ప - - వ -

ఈ మార్పు 7వ శతాబ్ది నుంచి శాసనభావలో కనిపిస్తుంది. నిత్యసంధిగా కావ్య భావలో ప్రవర్తించినా వాడుకలో స్వత్వరూపంలో ఉన్న ఉదాహరణలు గూడా ఎన్నో ఉన్నాయి (§§ 3.25,ఉ.26).

(16) ర > Ø / # హ - వర్ణవ్యత్యయం వల్ల ఏర్పడ్డ పదాది సంయుక్త హల్లుల్లో రెండోదిగావచ్చే ర వర్ణం