పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

460 తెలుగు భాషా చరిత్ర

అచ్చుల మధ్య, వర్ణవ్యత్యయం కారణంగా పదాదిన 'ఴ', 'డ'గా మారింది. అచ్చు (< *అఱ్ - చ్చు) (క్రీ. శ. 682) >డచ్చు, ఏఱు (క్రీ. శ. 725), ఏడు (క్రీ.శ. 798) (§ 3.8). రాతలో 13వ శతాబ్దిదాకా 'ఱ' కనిపిస్తుంది; కళింగ మండలంలో ఎక్కు వగా లేఖనంలో నిలిచిపోయింది. 12వ శతాబ్దిలోనే విలోమలేఖనం వల్ల నిఱు (<నిడు), విహారవాఴ (<విహారవాడ) వంటి రూపాలు కనిపిస్తాయి (§ 4.3).

(b) ຜ > ర/ # హ -

వర్ణవ్యత్యయం కారణంగా పదాదిహల్లుకు పరంగావచ్చే 'ఱ', 'ర' గా మారుతుంది. ఈ మార్చు గూడా 8వ శతాబ్టికే ఏర్పడ్డట్లు తెలుస్తున్నది. ఉదా. క్ఱొచ్చె (700- 725), క్రొచ్చె (925-50) (§§ 3 9, 4.29). దీనికి ప్రాక్తెలుగు రూపం

  • కొఱ్ చ్చె < *కొఱుచ్చె అయి ఉండాలి.

(10) ఱ > ర

శకటరేఫ సాధురేఫగా ఉచ్చరించటం ఏడో శతాబ్దికే కొన్నిచోట్ల మొదలై ఉంటుంది; ఉదా. ఇరుకుటూరు. (క్రీ ఈ. 669), చిట్టేరు. (క్రీ శ. 763). 11వ శతాబ్ది దాకా ర - ఱల భేదం రాతలో నిలబెట్టే ప్రయత్నం లేఖకులు చేశారు. 'ఱ' బదులు 'ర' రాయటం 12 వ శతాబ్ది నుంచి ఎక్కువై 15, 16 శతాబ్దులకల్లా విలోమలేఖనాల సంఖ్య పెరుగుతుంది. 17న శతాబ్దిలో 'తుఱక' శబ్దం శాసనాల్లో ఉంది. ఈ మార్పు మధ్యాంధ్ర౦లో మొదలై ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు కనిపిస్తుంది (§§ 3.14, 5.12, 6.9). స్పర్శహల్లు పరమైనప్పుడు ఱ -> ర మార్పు మరీ ప్రాచీనమై ఉంటుంది; తూఱ్పు (క్రీ. శ. 675), తూప్పు౯న (క్రీ. శ. 641) (§ 3.19). బహుశా అదేకాలంలో హల్పరక 'ఱ' గూడా 'ర' అయి ఉంటుంది.

  • త్ఱోవ > త్రోవ (క్రీ. శ. 945).

(11) - ణ - > 'న' / # అ -- అ - ళ - > - ల - /

దేశ్య శబ్దాల్లో అచ్చులమధ్య వచ్చే మూర్దన్య ణ, ళ లు క్రమంగా దంతమూలీయ 'న, ల'లుగా మారిపోవటం 8 వ శతాబ్దినుంచి కనిపిస్తుంది. కొణి > కొని, ఏళన్‌ > ఏలన్‌, పణి > పని, పళ్ళి (క్రీ. శ. 669) > పల్లి (క్రీ. శ. 764) (§ 3. 15-18).