పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం 459

వ్యవహారభాషలో వచ్చిన ధ్వని పరిణామాలు శాసన భాషలో, ప్రతిబింబిస్తాయి. 'ఱ' కారం అచ్చులమధ్య 'డ' అవుతుంది. ఈ మార్పు ఏ ఒక్క మూటలో వచ్చినట్లు శాసనాల్లో కనిపించినా స్థూలంగా కాలనిర్ణయం సాధ్యమౌతుంది. కొంతకాలం వాడుకటో మార్పు వచ్చిన తరవాతనే రాతలో మార్పుువస్తుంది. ఉచ్చారణ మారినా లేఖనం సా౦ప్రదాయికంగానే కొన్ని శతాబ్దులు సాగవచ్చు. కాని ఒక వర్ణం మరొక వర్ణ౦గా పూర్తిగా మారిన తరవాత లేఖకులకు సంప్రదాయ జ్ఞానం తగ్గుతుంది. తత్ఫలితంగా విలోమలేఖనం (inverse spelling) జరుగుతుంది. ఒక కాలంలో 'ఱ', 'డ' లు వేరుగా ఉచ్చరించేవారు, రాసేవారు; ఉదా. 'ఏఱు', 'వాడ'. 7వ శతాబ్దిలో 'ఱ' డ గా మారింది. చాలాచోట్ల 'ఏ ఱు' రాస్తున్నా, ఎక్కడన్నా ఆ తరవాత ఒక లేఖకుడు 'ఏడు' అని రాయవచ్చు. దీన్నిబట్టి అంతకు ముందే ఱ > డ ఆరంభమైందని గుర్తిస్తాము. కొంతకాలం తరవాత 'ఏడు' అని రాయటం బహుళంగాను, 'ఏఱు' అని రాయటం విరళంగాను జరుగుతుంది. ఇంకా కొంతకాలం జరిగిన తరవాత సంప్రదాయ౦ నిలబెట్టాలని ప్రయత్నించే ఒక లేఖకుడు 'ఏడు, వాఱ' అని రాస్తాడు. అంటే ఏ మాటలో 'డ' ఱ నించి చారిత్రకంగా వచ్చిందో, ఏది శబ్దసిద్ధమైన 'డ' కారమో గుర్తించే జ్ఞానం క్రమంగా తగ్గి 'డ' రాయవలసినచోట 'ఱ' రాయటం విలోమలేఖనం అంటారు. శకటరేఫసాధు రేఫల చరిత్రలోను ఇలాంటి పరిణామమే కనిపిస్తుంది. లేఖనంలో ఉన్న గుర్తులన్నిటికీ (పత్యేకోచ్చారణలు సమకాలంలో ఉండేవని ఊహించగూడదు. గుణంగా ఉన్న సంప్రదాయము చారిత్రకంగా దోషం అయినప్పుడు మార్పు పూర్తి అయిందని గుర్తించాలి.

16.6. ధ్వనులు : తొలి తెలుగుదశలో (క్రీ. శ. 700 దాకా) దేశ్య వర్ణాలు : / క గ చ జ ట డ ణ త ద న ప బ మ య ర ఱ ల ళ వ స ຜ/ (21 హల్లులు), / అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ / (10 అచ్చులు) ఉండేవి. అప్పటికే సంస్కృత ప్రాకృతాల ప్రభావంవల్ల మహా ప్రాణవర్ణాలు (10), శ ష హలు (3) తెలుగులో చేరాయి. ఈ వర్ణాల్లో 7 వ శతాబ్దిదాకా అట్టే మార్పులు రాలేదు. 7-9 శతాబ్దులమధ్య భాగంలో ఎన్నో రకాల ధ్వని పరిణామాలు తెలుగులో మొదలై ఆ తరవాతియుగంలో దేశం అంతటా వ్యాపించాయి.

(9) (a) ఱ > డ (1) # - / (2) అ - ఱ