458 తెలుగు భాషా చరిత్ర
ఆ మాట *చేట్ ట అనే రూపంలో ఉండి ఉండాలి. (7)వ సూత్రం వర్తించి (8) వ సూత్రం ఇంకా వర్తించక ముందున్న తాలవ్యీకృతరూపం, గోండి, మొ. సోదరభాషల్లోకి పోయి ఉంటుంది. అందువల్ల తెలుగులోలాగా పదాది 'చ' కార ఛాయలు కనిపిస్తున్నా, దంతమూలీయ హల్లుకు ఆయా భాషల్లో పొందే సహజపరిణామాలే గోచరిస్తున్నాయి. (8) వ సూత్రం ప్రవర్తించిన తరవాత ఈ మాటను ఎరువుతీసుకొంటే 'సేట' అనే ఈ భాషల్లో నిలచేది. దీన్నిబట్టి తెలుగు, గోండీ, కూయి మొ. భాషలకు ప్రాక్తెలుగు స్థితిలోనే సన్నిహితంగా ఉండేదని తెలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడాలమధ్య జరిగిన ఆదాన ప్రదానాలు చరిత్రక కాలంలోనివే గాని ప్రాక్తెలుగుదశకు చెందినవికాదు.
16.5. తెలుగు చరిత్రను పరిణామ దృష్టితో నాలుగు దశలుగా విభజించ వచ్చు. (1) క్రీ.శ. 200-700; (2) క్రీ.శ. 700-1200 ; (3) క్రీ.శ 1200-1600, (4) క్రీ. శ. 1600-1800. ధ్వనుల్లోను ప్రకృతి ప్రత్యయ స్యరూపంలోను ప్రధానమైన మార్పులు పై యుగాల్లో కనిపిస్తాయి. కావ్య సాహిత్యం నన్నయకాలానికి అయిదారు శతాబ్ధుల ముందే తెలుగులో ఏర్పడి ఉండాలి. శాసనస్థమైన వ్యవహార భాషకు-నన్నయకాలపు సాహిత్యభాషకు గుర్తించ దగినంత వ్యత్యాసం కనిపిస్తుంది. కావ్యభాష వ్యవహారభాష పరస్పరం ప్రభావితాలైన అధారాలు మొదటినుంచీ మనకు గోచరిస్తున్నాయి. 15 న కళతాబ్టిదాకా శాసనాల్లో బహుళప్రయోగంలో ఉండి కావ్య భాషలో విరళంగాఉన్న వాడుకలు వ్యవహారభాషకు చెందినవి; అలాగే కావ్యభాషలో బహుళంగా ఉండి శాసనాల్లో విరళంగా ఉన్నవి కావ్యభాషకు సాంప్రదాయికంగా సంక్రమించినవిగా గుర్తించాలి. అదీగాక, వ్యవహారంలో వచ్చిన మార్పులు శాసన భాషలో క్రమబద్ధంగా కనిపిస్తాయి. కావ్యభాషలో మార్పులు వచ్చినచోట అవి వ్యవహారభాషా ప్రభావంవల్ల వచ్చినవిగానే గుర్తించాలి. 'చేసెదరు' కావ్యభాషలో ప్రమాజరూపం.. తత్సదృశమైనది ఒకప్పుడు వ్యవహారంలోగూడా ఉండేది. అది కాలాంతరంలో 'చేసేరు'గా మారింది. 16 వ శతాబ్ధినుంచి, 'చేసేరు, చేసెదరు' రెండు రూపాలూ అర్వాచీన ప్రబంధాల్లోను, యక్షగానాల్లోనూ కనిపిస్తాయి. ఈ ద్వైవిధ్యం వ్యవహారంలో వచ్చిన మార్పును కావ్యభాషల్లో ఎక్కించటంవల్ల ఏర్పడ్డది. వ్యవహారభాష సహజంగా మారుతుంది ; కావ్య భాష తనంతటతాను మారదు.