Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం 457

16.4. తెలుగు దక్షిణ ద్రావిడభాషల నుంచి ఎప్పుడు వేరుపడ్డదో గట్టిగా చెప్పలేము గాని క్రీ. పూ. 5, 6 శతాబ్దులకే తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడ్డట్టు తెలుస్తుంది. ప్రాక్తెలుగు స్థితిలోనే కూయి, కువి, గోండి మొ. సోదర భాషలు తెలుగునుంచి పదాలను ఎరవు తెచ్చుకొన్నట్టు ఆధారాలున్నాయి, ఉదా.

ద. ద్ర. I: మ, చేఱు, కోత. కేర్‌, తొద కోఱ్, క. కేఱు.

ద. ద్రా. II: తె. చెరుగు, చేట; గోం. సేతి, హేతి, ఏతి : హేచ్, ఏచ్ = చేట; కూయి సేసి, కొండ సేఱ్హి, పెంగొ, కువి, మండ హేచి = చేట.

మ. ద్రా: కో. కేద్ = చెరుగు, నా. కేద్‌ ; కేత్‌ = చేట; ప. కేద్ / కేడ్‌ = చెరుగు; కేతి /కేటి = చేట ; ఒల్లారి, గదబ కేయ్‌ = చెరుగు, కోటి, కెటెన్‌ = చేట.

ఉ. ద్రా: కు, కేఁస్ .. = చెరుగు, కేఁతెర్‌ = చేట ; మా. కేస్ = చెరుగు ; కేత్ ను = చేట.

పై పదకుటుంబానికి ప్రాచీన ద్రావిడ మాతృకలో రూపాలు : కేట్ _; కెటు-(క్రి.), కేట్‌ ట్ - (వా.). ఇక్కడ 'ట' దంతమూలీయం. ప్రా.దృ. 'క' తాలవ్యాచ్చుల ముందు 'చ' గా మారటం ప్రాక్తెలుగు దశలోనే జరిగింది. (చూ. సూత్రం 7పైన), ద్విరుక్త దంతమూలీయ 'ట' తొలితొలుగు దశలో మూర్ధన్య 'ట' గా మారింది.

(8) (a) ట్ర > ఱ/అ--అ, (b) ట్‌ట > ట్‌ట.

అచ్చులమధ్య వచ్చే *ట, ఱగా మారింది ; ద్విరుక్తత ఉన్నప్పుడు దంతమూలీయం మూర్థన్యమైంది. అందువల్ల *కెటు > చెఱుగు, *కేట్ర్‌ిట పౌ 4 చేట్ట స్‌ చేటగా పర్చడ్డాయి. కఅచు ; కాటు, ఊఱు: ఊట, ఏఱు: ఏటి, మొ. జంటల్లో ఱ/ట లకు జనకవర్ణ౦ దంతమూలీయ 'ట' వర్ణం. తాలవ్యీకరణం తెలుగు, తమిళ, మలయాళాల్లొనే జరిగింది. అప్పుడు గోండి, కూయి, కువి, పెంగో మండ-భాషల్లో 'క' కారయుక్త రూపాలే ఉండాలి. కాని సకారాది రూపాలే కనిపించటంవల్ల ఈ పదం తెలుగునుంచి ఎరువుతెచ్చుకొన్నదై ఉండాలి. ఈ భాషల్లో దంతమూలీయ *ట్త్‌ ట స/చ లుగా మారుతుంది. చూ. కూయిసేని, కువిహేచి, గోండీలో *ట్ ట, త అపుతుంది, చూ. సేతి. అంటే ఈ భాషలు తెలుగునుంచి ఎరవుతెచ్చుకొన్నప్పుడు