Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

456 తెలుగు భాషా చరిత్ర

కేవలంపురుష వాచక శబ్దాలకు బహువచనంలో వాడేవారు; అది తెలుగులో మహద్భహు వచనమై౦ది. -అర్‌/-వర్‌ ప్రత్యయం మహత్తు (స్త్రీ పురుష) బహువచన ప్రత్యయంగా కొన్ని శబ్దాల్లోను, సంఖ్యావాచకాల్లోను మాత్రం నిలిచించి, ఉదా. ఎవ్వరు, అల్లరు, మల్లురు, మూవురు, ఇరువురు, మొ. వి. 'ళు' సామాన్య బహువచన ప్రత్యయంగా ఉండేది.

16.3. ప్రేరణార్థంలో వచ్చిన -ఇంచు/-పించు ప్రత్యయాలు అనుచిత విభాగంవల్ల ఏర్పడ్డవి. ప్రా. ద్రా. లో *వి/*ప్సి ప్రేరణ ప్రత్యయం. భూతభవిష్యత్తుల్లో దీనికి పరంగావచ్చే ప్రత్యయాలు *-న్‌ త్-, *-మ్‌ప్స్- అని ఉండేవి. తాలవ్యాచ్చు ప్రభావంవల్ల దంత్య 'త్త', 'చ్చ'గా మారింది.

ప్రా. ద్రా. తమిళం తెలుగు

(భూ) కెయ్‌-వి-న్‌ త్త్‌- చెయ్‌-వి త్త్‌- చెయ్-వి-న్‌చ్‌ -

(భ) కెయ్‌-పి-మ్‌ప్స్‌- చెయ్-వి-ప్స్- (> చేయించ్‌ -) చెయ్ - వి -మ్‌ప్‌- ( > చేయింప్‌-) (భూ) నట-ప్పి-న్‌ నట-ప్పి-త్త్‌- నడ-పి-న్‌చ్‌ -

(భ) నట-ప్పి-మ్‌ప్స్- నట-ప్పి-ప్స్- నడ-పి-మ్‌ప్‌-.

ప్రాచీనభాషలో -ఇందులోని 'చు' భూతేతర ప్రత్యయాలు (ముజ్జీత్తులు) పరంగా ఉన్నప్పుడు 'వు' కావటానికి కారణం '౦చు' '౦పు' లు ప్రా.ద్రా. లో కాలబోధక ప్రత్యయాలు కావటమే. ప్రత్యయ ద్విరుక్తివల్ల సకర్మక క్రియ లేర్పడే ప్రక్రియ ప్రాక్తెలుగులోనే నశించింది. (§ 2.42). క్త్వార్థకంలో ప్రా. ద్రా.లో ఉన్న *ఇ, *చ్చి/చి ప్రత్యయాల్లోని చత్వసత్వాలు ధాతుగతాలై 'ఇ' ఒక్కటే క్త్వార్ధక ప్రత్యయంగా పరిగణించబడ్డది. విన్‌-ఇ, నిల్‌-చి, విన్‌-అక, నిల్‌-అళ రూపాలను పోల్చిచూస్తే 'చి' లో 'చ' ధాతు భాగంగా పరిగణించటం అర్వాచీనమని తెలుస్తుంది; చేసి, కోసి, మొ. చోట్ల గూడా ప్రప్రథమంలో 'సి' ఏక్త్వార్ధక ప్రత్యయం (§ 2.46) ప్రా. ద్రా. నుంచి ద, ద్రా. శాఖలద్వారా తెలుగులో ఏర్పడ్డ ధాతుప్రత్యయ నిర్ణయం ఇంకా శాస్త్రీయంగా సమగ్ర౦గా జరగలేదు. ధ్వనుల మార్పులను గురించి మనకు తెలిసినంత నిష్కర్షగా ఇంకా ఈ భాగం తెలియదు.