446 తెలుగు భాషా చరిత్ర
రహదారు (< ఉర్దూ. రహ్‌దార్ మార్గరక్షకుడు, చౌకిదారు) తెలుగులో వాహనం అనే అర్థంతో ఈ కింది ప్రయోగం ఉంది. “చిలుక రహదారు రాహుతు తలిరాకు...” (అనిరుద్ధ చరిత్రము 3-77). ఈనాడు మార్గం, రస్తా అని ఈపదానికి అర్థాలు
రజా (< ఉర్దూ; పర్షి. రోజా ఉపవాసం, దినం) సెలవుదినం.
వస్తాదు (<పర్షి - ఉస్తాద్, ఉపాధ్యాయుడు), ప్రవీణుడు, మల్లయుద్ధంలో నైపుణ్యం కలవాడు.
సీసా (< పర్షి, సీసహ్ గాజు). గాజుతో చేసిన చిన్న బుడ్డీ.
హుషారు ( < పర్షి. హోష్ యార్ జాగరూకత, జాగ్రత్తకలవాడు)చురుకుదనం సంతోషం.
దస్తూరీ (< పర్షి దస్తూర్ ఆచారం, సంపద). చేతివ్రాత అని దీనికి తెలుగులో అర్థ పరిణామం.
తగాదా (< పర్షి. తగాదహ్ ప్రయత్నంచేయు). వాదించు, అభిప్రాయ భేదాన్ని ప్రకటించు, చిన్న కలహం అని తెలుగులో పరిణమించిన అర్థం.
జాబిత (< అర. జాబితా చట్టాలు, చట్ట విధి, చట్టప్రకారం) ఈ పదానికి తెలుగులో వస్తువుల పట్టిక అనే అర్థంలోనే వాడుక.
నిఘంటువులకు ఎక్కని హిందూస్టానీపదాలు వ్యవహారంలో ఎన్నో ఉన్నాయి. హిందూస్థానీ ప్రాతిపదికలు గల శబ్దపల్లవాలు కూడా తెలుగులో ఏర్పడి ఉన్నాయి. ఉదా :- అటకాయించు, కేటాయించు, దబాయి౦చు, బుకాయించు, మినహాయించు, గాబరాపడు, గప్పాలుకొట్టు, బేజారెత్తు మొదలైనవి. వీటిలో కొన్నింటి ప్రయోగాలకు విశేషార్ధచ్చాయలు కూడా గుర్తించవచ్చు. ఉదా. టోపీవేయ (మోసంచేయు). పాగావేయు (పెద్ద ప్రయత్నంచేయు) మొ.వి.
15.9. భాషా పరిణామంలో ధ్వనులమార్పుకు సంబంధించి ధ్వనిసూత్రాలను ప్రతిపాదించినట్లు భాషాశాస్త్రఙ్ఞు లు అర్థపరిణామానికి సంబంధించిన సూత్ర నిర్ణయం చేయడం సులభసాధ్యం కాదు. సాధారణంగా భాషలో జరిగే అర్థపరి