444 తెలుగు భాషా చరిత్ర
<పర్షి, అస్వార్, 'అశ్వారోహి, రౌతు, అశ్విక సైనికుడు'). తెలుగులో వాహ్యాళి, విహారం, అని అర్థ పరిణామం. ఉదా : “ఎప్పుడు నలువ తేరెక్కి యష్టాదశ ద్వీపాళీ నసివాఱు దిరిగెలీల" (కాశీఖండం 4-195): "ఆపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని కసివాఱుగా నేగునట్టి బయలు” (మనుచరిత్ర 1-11) (పై ప్రయోగాల్లోనేగాక సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా 'అసివాఱు' అని శకటరేఫతో ఆరోపము౦డడం దోషం. సవారి అనే రూపాంతరానికి 'బండిగూడు' అనే అర్థం కూడా ఉంది. స్వారి అనే రూపా౦తరానికి 'గుర్ర౦ పై ఎక్కిపోవుట' అనే అర్థం రాయలసీమలో కనిపిస్తుంది.)
ఇనాము రూ. ఈనాము (< ఉర్దూ ఇనామ్ < అర ఇన్ అమ్ 'బహుమతి') ఈ అర్థంలో వరాహపురాణంలో ప్రయోగం ఉంది. “కరి మయూర మరాళికలకు నొయ్యార మీనామిచ్చీ నడపు సన్నంపు నగలు” (వరాహ. 4-159) బహుమతి అనే అర్ధంతోపాటు బహుమతిగా ఇవ్వబడిన భూమి అని కూడ నేడు దీనికి రూఢ్యర్థం.
ఇలాకా (<ఉర్దూ ; ఆర. ఇలాకా, దేశ౦, మతం) ప్రదేశం, తాలూకా, సంబంధించిన అని తెలుగులో దీనికి అర్థాలు.
కమరు రూ. కమ్మరు (<ఉర్దూ; పర్షి. కమర్ నడుము, కటిస్థలము) వడ్డాణం. మొలనూలు. “లజ్జయెరుగని కటిమండలంబుమీద వలువ వజ్రాల కమరు గర్వంబు సూప..." (కాశీఖండము 3-24).
కలంకారి (<ఉర్దూ. కలంకారీ, ఖలం = ఫుల్ల ; కార్ = పని రాత. చిత్ర లేఖనం). తెలుగులో మైనపు కలంచేసే అద్దకపుపని, ఆధునిక చిత్రకారుల పరిభాషలో Batik Painting.
గస్తు : రూ. గస్తీ (<ఉర్దూ. గస్త్; పర్షి- గస్తీ; తిరుగు, పరిభ్రమించు రాత్రుల్లో తిరుగుతూ కాపలాకాయు. “ఆలీలఁ గొఱవి దయ్యంబుల దివ్వెకోలల వారిగా గస్తు దిరిగి...” (గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం 16- 68).
గోరీ (<ఉర్దూ, పర్షి. గోరి సమాధి) తెలుగులో ఈపదానికి మహమ్మదీయుల సమాథి అని మాత్రమే అర్థం.