అర్థపరిణామం 443
ప్రవేశించినాయి. మనకు తెలిసినంత వరకు కావ్యాలలో ప్రయుక్తమైన హిందూస్తానీ పదాలలో మొదటిది త్రాసు.". ..త్రాసులంబోని చిత్తంబులతోడుతఁ, బ్రజవివాదము లెడఁబక్షముడిగి....” (శాంతి.2-374) అని “త్రాసు శబ్దానికి తిక్కన ప్రయోగం. 'తరాజూ' అనే పర్షియన్ భాషా పదానికి వికృతిరూపం త్రాసు. “ధనము కలిమియు లేమియఁద్రాసునందు నిలిపి యెత్తంగ...” (శాంతి. 4-33) అనే పద్యంలోకూడా త్రాసుకు రెండవ ప్రయోగం తిక్కనలో కసిపిస్తుంది. కేతన కూడా ఈపదాన్ని ప్రయోగించినాడు. “అచ్చులు ద్రాసులుఁ దూములుఁ బొచ్చెంబుగజేసి ...” (విజ్ఞానేశ్వరీయము, ప్రాయశ్చిత్తకాండము, 65), నాచన సోముని హరివంశ౦లో 'కోహళి' ప్రయోగంవుంది. “పార్వతీ పతికిఁ బ్రభాత భూతపతి గొన్న మెలరుఁ గెందమ్మి గొన్న కోహళి యనంగ...” (ఉత్తర హరివంశము, 3-66). ఇందలి కోహళి శబ్దం 'కులాహ్" అనే పర్షియన్ శబ్దానికి వర్ణవ్యత్యయ రూపం. శ్రీనాథుని రచనల్లోను, చాటువుల్లోను కూడా హిందూస్తానీ పదాలు చాలా కన్పిస్తాయి;
ఉదా ; పూజారి వారి కోడలు తాఁజారగ బిందెజారి దబ్బునఁ బడియెన్ మైజారు కొంగు దడసిన బాజారే తిరిగిచూచి పక్కున నవ్వెన్.
పై చాటువులోని మైజారు (< పర్షి. మీజర్ 'కట్టుకొను వస్త్రం'), బాజారు (<ఉర్దూ; పర్షి. బజార్ 'విపణివీధి'). ఇవి హిందూస్తానీ పదాలే. తెలుగులోనికి ఎరువు తెచ్చుకున్న హిందూస్తానీ పదాలు వందలకొద్దీ ఉన్నాయి. ప్రతిదేయాలైన కొన్ని హిందూస్తానీ పదాల్లో కూడా అర్ధపరిణామం కన్పిస్తుంది; ఉదా.
అమీను (<ఉర్థూ. అమీన్ < పర్షి. అమీన్ విశ్వసపాత్రుడైన వ్యక్తి ఉద్యోగి) న్యాయస్థానంలో ఒక ఉద్యోగి అని మాాత్రమే తెలుగులో వ్యవహారం.
అసలు (< అర. ఉర్దూ, అసల్. మూలం, వృక్షమూల౦). తెలుగులో దీనికి మూడర్థాలు ఏర్పడ్డాయి. 1. వడ్డీకిచ్చిన ధనం. 2. శ్రేష్టమైన, కల్తీలేని (అసలు సరుకు) 3. కొందరి వ్యవహారంలో ఒక ఊతపదం, “అమ్మనీయల్లుని నసలేనెరుంగ, ఏరీతి.దెలియదు నేయుపాయంబు" (పల్నాటి వీరచరిత్ర, పుట 73)
అసివారు రూ. సవారి (రీ), స్వారి (రీ) (< ఉర్దూ, అస్వార్, సవార్