అర్థపరిణామం 437
అయోమయం. (< సం అయోమయః ఇనుముతో చేయబడినది. అయో వికారము) ఈ పదానికి మూలంలో ఉన్న అర్థం తెలుగులోలేదు. కేవలం అస్తవ్యస్త స్థితిని, అర్థం కాని స్థితిని తెలుపడానికి ఈ పదాన్ని తెలుగులో వాడుతారు. (దేశంలో పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి; ఎంత చదివినా అయోమయంగా ఉంది.)
అవన్థ ( సం. అవస్థా. 1, స్థితి,ఉనికి, 2. దేహాదులకు కాలము ననుసరించి వచ్చినదశ .) ఈ పదానికి తెలుగులో బాధ, దురవస్థ, హీనస్థితి అనే అర్జపరిణామం కన్పిస్తుంది. అవస్థపడు, అవస్థపెట్టు అనే శబ్దపల్లవాలు కూడా ఈ తరంలోనే ఉన్నాయి.
అసహ్యం (<సం, అసహ్యమ్ సహింపరానిది, సాధ్యము కానిది) తెలుగులో దీనికి చెడ్డ, నీచం, నిష్టం, రోత అనే అర్థాల్లోనే వ్యాప్తి.
అవసర౦ (<సం. అవసరః 1. తఱి, సమయము, ప్రస్తావనము కార్యోచిత సమయము, 2. (తర్క) సంగతి విశేషము) కార్యోచిత సమయమనే మూలార్థంలో నన్నయ ప్రయోగం ఉంది. మధ్యా. “అవసరజ్ఞుండయి వ్యాసుఁ డేతెంచెనంత......" (అది. 4 254) కాని, నేటి తెలుగులో ఈ పదానికి అవశ్యం, అక్కర, తొందర అనే అర్ధాలు ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అర్థం ప్రబంధకాలంలోనె రూఢిలో ఉందనడానికి ఆధారం !
గీ! "హంసవరులార ? మాకొక్క యవసరంబుఁ గలిగి పంపించితిమి” (ప్రభావతీ ప్రద్యుమ్నము 1-111)
ఉత్తరం (< సం. ఉత్తరః 1. ఉత్తరపుదిక్కు, 2. మీదిది, పైది, 3. అధికము, ఎక్కువ. 4. అతిక్రమంచినది, దాటినది, 5. ప్రతివచనము, సమాధానము). సంస్కృతంలోని అర్థాలతో పాటు ఈ పదానికి లేఖ, జాబు అనే అర్థం తెలుగులోనే పరిణమించయుండడం గమనింపదగింది
గీ॥ "అచటి కరుగుచునండి సురాధినేత, మిమ్ము రమ్మని యిదె యుత్తరమ్ము పనిచె" (కువలయాశ్వచరిత్రము 4-203)
ఉద్యోగం (< సం. ఉద్యోగః 1. యత్నము, పూనిక, 2. ప్రయా