436 తెలుగు భాషా చరిత్ర
అతిశయం (< సం. అతిశయః ఎక్కువైనది, అధికము, ఆధిక్యము) తెలుగు వ్యవహారంలో ఈ పదానికి ఆశ్చర్యం, అద్భుతం, గొప్ప, గర్వం అనే అర్థాలుకూడా కన్పిస్తాయి. (మీరు మాయింటికి రావడం అతిశయము); ఆమెకు అతిశయం ఎక్కువ)
అదృష్టం (< సం, అదృష్టమ్ 1. చూడబడినది, 2. ఎఱుగబడినది. 3. కర్మజన్యములై సుఖదుఃఖ హేతువులగు ధర్మాధర్మములు) తెలుగులో భాగ్యం, మేలు అని దీనికి పరిణమించిన అర్థం. (అదృష్ట జాతకుడు, అదృష్ట శాలి). దీనికి భిన్నమైంది దురదృష్టం
అంతస్తు (< సం, అంతస్థః 1. రహస్యము, 2. మఱుఁగుచోటు 3. మేడపై భాగము) ఈ పదానికి తెలుగులో మేడభాగం అనే అర్థంతోపాటు గౌరవం పరువు. హోదా అనే అర్థాలు కూడా వాడుకలో ఉన్నాయి. (ఈ పని వాడి అంతస్తుకు తగదు; వాళ్ళు మన అంతస్తుకు తగినవాళ్ళు కారు).
అనుమానం (< సం. అనుమానమ్ 1. అనుమతికి సాధనము, ప్రత్యక్షాది ప్రమాణములలో వొకటి, 2. ఊహించుట, ఊహ.) తెలుగులో ఈ పదానికి సందేహం, సంశయం అనే అర్థంలోనే ఎక్కువ వ్యాప్తి. (ఈ పనిచేసింది వాడని నా కనుమానం; వాడనుమానం మనిషి; ఈ అర్థంలో తిక్కన ప్రయోగం.
కం॥ “జనసీవధంబుచేసిన, ననుమూనమె నరకమగుట. ..” భారతం, శాంతి. 5.267)
అన్యోన్య౦ (< సం. అన్యోన్య _ 1. పరస్పరం 2. ఇతరేతరము, 3. ఒక అర్ధాలంకారము) ప్రీతి, ఇష్టమనే అర్థం ఈ పదానికి వాడుకలోకన్సిస్తుంది. (వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు).
అభ్యతరం (< సం. అభ్యంతరమ్ 1, లోపలిది. 2. అభిజ్ఞము తెలిసినది. 3. అంతరంగికము, 4. అ౦తఃకరణము ఈ పదానికి తెలుగులో అడ్డు, ఆటంకం అనే అర్థంలోనే రూఢి (అతనిమాట కభ్య౦తరం లేదు). అభ్యంతరం చెప్పు = అడ్డుచెప్పు.
అభ్యర్ధి (< సం. అభ్యర్థిః యాచించువాడు, కోరువాడు,) ఎన్నికలలో నిలబడన వ్యక్తి లేదా ఉద్యోగాదులకు దరఖాస్తుపెట్టిన వ్యక్తి అని ఈనాటివాడుక ,