Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30. తెలుగు భాషా చరిత్ర

2.22. (i) తె. డ- < * -ట-, *-లు-
      మూలభాషలో మూర్థన్యాక్షరాలు పదాదిని ఉండవు. తెలుగులో పదాది డకారం మొదట అచ్చుల మధ్యనే ఉండి తరవాత వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినదై ఉంటుంది (చూ. 2. 13). ఈ స్థానంలో ఇది * టనించి గాని, ఴ నించిగాని వస్తుంది. పదాది డకారం తెలుగు సాహిత్యంలోనే తరవాత కాలంలో ద గా మారుతుంది.                        
                                                                          
         తె. డాఁగు, దాఁగు : త. ఆటంకు, క. ఆడంగు, కూ. డా- (56).
         తె. డెబ్బది. డెబ్బయ్‌ : త, మ. ఎఱు-పతు, క. ఏఱ్-పత్తు,                 
             ఎప్పత్తు (772).
                                                                      
    (ii) తె. -డ- < * -ట-
         తె. ఆడు : త. మ. అటు, క. తు. ఆడు (290).
         తె. పడు : త. మ. పటు , క. పడు (3190).                                    
   (iii) తే. -డ- > * -ఱ-
         తే. ఏడు : త. మ. క. ఏఴు (772).                                
         తె. కోడి : త. మ. క. కోఴి (1862).
         తె. సుడి : త. మ. చుఴి, క. సుఴి (2223).
                                                                           
     ఱ కారం తెలుగు శాసనాల్లో ప్రత్యేక వర్ణంగా తొమ్మదో శతాబ్దం మధ్య భాగం దాకా ఉంది. ఆ తరవాత అది అచ్చుల మధ్యా, వర్ణవ్యత్యయం వల్ల పదాదికి వచ్చినప్పుడూ డ కారంగా మారింది. (పదాది డకారం తరవాత ద కారంగా మారింది). వర్ణవ్యత్యయం వల్ల పదాది హల్లుకి తరవాత వచ్చినప్పుడు ఆది రేఫగా మారింది. (కృష్ణమూర్తి 1958 a.)
                                                                         
 (iv) తె. -ండ- < * - న్ఱ-, * -ం-ట-
      తె. ఎండ : త. ఎన్ఱు, గోం, ఎద్ది (738).
      తె. మూఁడు : త, మూన్ఱు, మ. మూన్ను, క. మూఱు (4147).
      తె. బఁడి : త. పంటి, వంటి, మ. వంటి, క. తు. బండి (3219).