434 తెలుగు భాషా చరిత్ర
15.3. వివరణాత్మకమైన అర్థదృష్టితో నేటి తెలుగుభాషా పదజాలాన్ని స్థూలంగా పరీలించి ఇంతవరకు పేర్కొన్న [15.2. (1) నుండి (11) వరకు] విధంగా వర్గీకరించవచ్చు. ఈపద్దతికి భిన్నమైంది చారిత్రక పద్దతి. చారిత్రక పరిశీలనవల్ల పదాలకు నానార్థాలు లేదా అర్థవిస్తృతి ఏఏ కాలంలో ఏర్పడ్డదో, సారూప్యపదాలు, పర్యాయపదాలు, ఏఏ కాలలో వ్యాప్తికి వచ్చినాయో కొంతవరకు నిరూపించడం సాధ్యం కావచ్చు. కాని ఇట్టి పరిశీలనకు చారిత్రక సూత్రాలమీద నిర్మితమైన సమగ్రాంధ్ర భాషాకోశ౦ అనివార్యం. తెలుగు భాష ఇంతవరకు చారిత్రక నిఘంటువులే లేనందువల్ల ఉన్న నిఘంటువులు కూడా సమగ్రాలు కానందువల్ల అర్థవిపరిణామ పరిశీలనలో లోతుకు పోలేము.
15.4. ఒకదశలో ఒక పదానికి ఉన్న అర్థంతోపాటు మరొక అర్థం ఆ పదానికి ఏర్పడ్డప్పుడు లేదా ఒక అర్థాన్ని తెలియజేసే పదంతోపాటు మరొక పదం కూడా ఆ అర్థాన్ని తెలిసినపుడు అర్థపరిణామం జరిగిందని చెప్పవచ్చు- ఉదాహరణకు : కొమ్ము అనే పదానికి నిఘంటువులు ఇచ్చిన (1) పశుశృ౦గము, (ఓ) ఏనుగు దంతము, (8) పందికోర, (4) ఊదెడి వాద్యవిశేషం, అనే అర్థాలు క్రమంగా ఏర్పడ్డవని గ్రహించవచ్చు. ఒకపదానికి అవూర్వమైన ఒక అర్థం ఏర్పడ్డప్పుడు పూర్వార్ధం భ్రష్టం కానక్కరలేదు; ఉదా. తడి అనే పదానికి నిఘంటువుల్లో గ్రంథస్థమైన అర్థాలు : (1) తేమ, ఆర్ధృత, (2) నీర, (3) తడి బట్ట అర్దృవస్త్రము. ఇటీవల తడి అనేమాటకు డబ్బు అనే అర్థం (వాడి చేతిలో తడి లేదు) వాడుకలోకి వచ్చింది. ఈ కొత్త అర్థంతోపాటు పూర్వార్దాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకపదానికి నూతనార్థమొకటి సన్నిహితులైన కొందరిలో మాత్రమే వ్యాప్తి పొందవచ్చు. కాని విస్తృత వ్యాప్తి. దానికి లేకుండ సమాజంలో గుర్తింపదగినట్లు రూఢిపడనప్పుడు ఆ పదంలో అర్ధపరిణామం జరిగిందని చెప్ప లేము; ఉదా. విభూతిపండు కోడిగుడ్డు అనే అర్ధ౦లోను, మందు మత్తుపానీయ మనే అర్థంలోను తెలుగుదేశ౦లో కొందరి వ్యవహారానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి
15.5. ఒక మూలభాషనుండి జన్యభాషలు పరిణమించినప్పుడు మూల భాషలో ఉన్న పదానికి జన్యభాషల్లో అర్దా౦తరాలు ఏర్పడవచ్చు. సోదర మాండలికాలు క్రమంగా శాబ్దికమైన పరిణామంతోపాటు అర్థపరిణామాన్ని గూడా