Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థపరిణామం 433

అరబిక్‌ :

కలం (కొలమానం) కలం (లేఖిని)

ఇంగ్లీషు :

లేడి (ఆడజింక) లేడి (lady)

కారు (పంటకాలం) కారు (car)

పంపు (పంపడం) పంపు (pump)

(11) పర్యాయపదాలు (synonyms) : ఒకపదానికి అనేకార్దాలున్నట్లే ఒక అర్థాన్ని అంటే ఒకవస్తువును లేదా భావాన్ని తెలియజేయడానికి అనేక పదాలుండవచ్చు. వీటినే సమానార్థక పదాలు లేదా పర్యాయపదాలంటారు. ఈనాటి తెలుగులో ఉదాహరణకు కొన్ని పర్యాయ పదాలు : వంద, నూరు; నాగలి, మడక; బండి, రాట్నం, గిలక; గేదె, బర్రె, ఎనుము; బాడుగ, అద్ధె, కిరాయి; వ్యవసాయం, సేద్యం, కమతం, సాగు; కుండ, తూము, కుంచం, బుడ్డి, మూత; అరివిల్లు, సింగాడి, కొర్రు, వరదగూడు; పట్టెడ, పలుపు, జోత, దొత్తె, జొత్తిక; హద్దురాయి, నెంబర్రాయి, సర్వేరాయి, బౌండ్రాయి, నామాల్రాయి.

అన్య దేశ్యపదాలు ఒక భాషలో ప్రవేశించినపుడు దేశ్యంతో, అన్యదేశ్యాలైన పర్యాయపదాల జంటలు కొన్ని ఏర్పడుతాయి. ఉదా ; పెండ్లాం. భార్య; గుడి ఆలయం; ఊరు, గ్రామం; పెండ్లి, వివాహం; కొండ; పర్వతం; చుక్క, నక్షత్రం; వాన, వర్షం, మొదలైనవి. వీటిలో రెండవపదం సంస్కృతం. గది, రూము; బడి; స్కూలు; సిరా, ఇంకి; బాట, రోడ్డు, మొదలైన పర్యాయపదాల్లో రెండవపదం ఇంగ్లీషు పదం. మామూలు వ్యవహారంలోని కొన్ని పదాలకు చాల భాషలో పర్యాయపదాలుండవచ్చు. ఉదా. ఆముదం, ఉగ్గు; పాలు, బాయి; ఉయ్యాల, లాలి; అన్నం, బువ్వ; కుక్క, ఉజ్జు; కోడి, టోబు, మొదలైనవి. ఇంతవరకు పేర్కొన్న వాటిలో పూర్తిగా సమానార్థకాలై పరస్పరం మార్చి ప్రయోగించదగిన పర్యాయపదాలు చాలా తక్కువ. అసలు ఏభాషలోనైనా ఒక దాని స్థానంలో మరొకదాన్ని ప్రయోగించదగినట్టి పర్యాయపదాలుండవు. పర్యాయ పదాలు సమానార్థకాలైనా వాటి ప్రయోగంలోను రూఢిలోను అర్థాంతరచ్చాయలుంటాయి. పర్యాయ పదాలు చాలా వరకు ప్రా౦తీయ, వైయక్తిక, సాంఘిక మాండలిక భేదాలకు సంబంధించి ఉంటాయి.

(28)