Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

432 తెలుగు భాషా చరిత్ర

మంచివే కానీ మనసు మంచిది కోదు. He talks well but has a bad heart. యింకా మాటలురాని బిడ్డ A child that cannot yet speak. వానికి ఆవూరిలో మాటవాసికద్దు. He has influence throughout the town. ఆయనమాటలకు ఎదురులేదు His word is law. మాటలకు మాత్రమే పేదరికములేదు As far as words go he is rich enough, వొకమాట యిచ్చి పదిమాటలు తీసికొన్నాడు His reproaches were returned tenfold. నా నోటి మాటలు పీకి నాకడుపు మంట పోసికొన్నాడు He tormented me with harassing questions.

(10) సారూప్యపదాలు (homonyms) : జకపదానికి అర్థవ్యాప్తి వల్ల ఏర్చడ్డ అనేకార్థాలు సాధారణంగా సంబంధాత్మకాలు. వాటి సంబంధాన్ని అర్థ పరిణామ సూత్రాల ద్వారా వివరించవచ్చు. పరస్పరసంబంధం లేనట్టి భిన్నార్థా లుండి రూవభేదంలేని పదాలు సారూప్యపదాలు. ఒకప్పుడు భిన్నార్ధాలతో భిన్న రూపాలతో ఉండిన రెండుపదాలకు ధ్వనిపరిణామంవల్ల తద్వాతికాలంలా శాబ్టికంగా అభేదం ఏర్పడవచ్చు. అప్పుడు దానికి మౌలికమైన రెండర్థాలుండవచ్చు. అటు వంటప్పుడు వివరణాత్మకదృష్టికి పరస్పరసంబంధంలేని రెండు భిన్నార్ధాలు ఆపదానికి ఉంటాయి. అటువంటి పదాలను సారూప్యపదాలంటాము. నిఘంటువుల్లో ఇట్టి పదాలు సాధారణంగా వేర్వేరు ఆరోపాలు (1. 2... సంఖ్యా సంకేతాలతో) గా ఉంటాయి. ఉదాహరణకు : ఈనాటి తెలుగులో వాడు ( = అతడు), వాడు (= శోషిల్లు) అనే రెండు పదాలు ఓకప్పుడు శాబ్దికంగా భిన్నరూపాలు. తెలుగు భాషాపరిణామంలో దీర్ఘ౦ మీది అనునాసికవర్ణానికి లోపం జరిగినందువల్ల వాండు > వాఁడు > వాడు అనే సర్వనామం 'వాడు' అనే క్రియతో అభేదంగా పరిణమించింది. అట్లానే 'నాడు' అనే మాటకు పరస్పర సంబంధంలేని రెండు భిన్నార్థాలున్నాయి; నాండు > నాఁడు > నాడు (= దినం), నాడు (= దేశ౦)తో అభిన్నంగా పరిణమించింది. కారు, ఊరు, మీరు, మరుగు, మొదలైన అర్ధద్వయం ఉన్న సారూప్యపదాలు తెలుగుభాషా పరిణామంలో సాధుశకటరేఫల వర్ణైక్యం వల్ల ఏర్పడి నట్టివే. ఇతర భాషలనుండి కొన్ని పదాల్ని స్వీకరించినందువల్ల తెలుగులో భిన్నవ్యుత్పత్తి గల సారూవ్యపదాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి.

ఉదా. తెలుగు సంస్కృతం

అరి (కప్పం) అరి (శత్రువు)

కల (స్వప్నం) కల (కళ)