పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

428 తెలుగు భాషా చరిత్ర లేదా దశకు మాత్రమే భాషను పరిమితం చేసికొని దాని పూర్వపరావస్థలతో సంబంధం లేకుండా పదాల అర్థస్వరూపాన్ని లక్షణాలను వర్గీకరించి వివరించి చెప్పినప్పుడది వివరణాత్మక అర్థవిజ్ఞానం (syashronic or descriptive semantics) అవుతుంది. ఒకభాషలోని పదాలలో వివిధ కాలాల్లో లేదా వివిధ దశల్లో జరిగిన అర్థపరిణామాన్ని కాలక్రమ పద్ధతిలో చారిత్రకదృష్టితో పరిశీలించి వివరించినప్పుడది చారిత్రక అర్థ విజ్ఞానం (diachronic or historical semantics) అవుతుంది.

15.2. ఈనాటి తెలుగుభాషా పదజాలాన్ని వివరణాత్మక పద్ధతిలో వాటి శబ్దార్థ స్వరూప లక్షణాదులను కిందివిధంగా వర్గీకరించి పరిశీలించవచ్చు:

(1) ధ్వన్యనుకరణపదాలు (onomatopoetic words): కాకి, మేక, గురక, డప్పు, (వాద్యవిశేషం) ఇత్యాది నామవాచకాలు కొన్ని; ఢామ్మని, టపీమని, బుడుంగుమని, ఇత్యాది క్రియావిశేషణాలు కొన్ని: గణగణ, గుడగుడ, కుతకుత, కిచకిచ, పరపర, ఇత్యాది ఆమ్రేడితక్రియావిశేషణరూపాలు కొన్ని నేటి తెలుగులో ఉన్నాయి. కాని శబ్దానుకృతులైన ఇట్టి పదాలసంఖ్య అతి స్వల్పం

(2) నిష్పన్నరూపాలు (derived forms) : ఒక భాషలో పదజాలం అనంతంగా లేదా అత్యధికంగా ఉన్నట్లు తోచినా ఆ పదాలను విశ్లేషించి పరిశీలించి నప్పుడు మౌలికమైన పదాల (primary words) సంఖ్యపరిమితమని తెలుస్తుంది. పద ప్రత్యయాది సంయోజనం వల్ల ఒక మౌలికపదం నుండి వివిధార్థాలను, అర్థాంత రాలను తెలియజేసే పదాలు, పదబంధాలు అనేకం భాషల్లో ఏర్పడడం సహజం. తెలుగులో క్రియాధాతువులకు కృత్ప్రత్యయాలుచేరి అర్థాంతరాన్ని తెలిపే కృదంత రూపాలు (primary derivatives) ఎన్నో ఉన్నాయి ;

ఉదా. ఎండు + అ> ఎండ, అమ్ము + అకం అమ్మకం, ఒడ్డు+అన> ఒడ్డన; తిను + అడం/అటం> తినడం/తినటం; కోరు + ఇక > కోరిక; పెట్టు + బడి > పెట్టుబడి.

(3) నామధాతువులకు తద్దిత ప్రత్యయాలు చేర్చినందువల్ల అర్థాంతరాన్ని తెలిపే తద్దితరూపాలు (secondary derivatives) ;

ఉదా. నేర్పు + అరి > నేర్పరి, టక్కులు+ఆడి > టక్కులాడి, గంప +