408 తెలుగు భాషా చరిత్ర
7. 'f', 'ప' వేరుగా ఉంటాయి. 7. 'f', 'ప' గా మారుతుంది : ఆఫీసు, కాఫీ, తోపు, ఆపీసు, కాపి, తోపు.
8. పదాది గకారం దేశ్యశబ్దాల్లో 8. 'గ', 'గె' గా మారుతుంది. నిలుస్తుంది : గట్టు, గడ్డ, గండి, గెట్టు, గెడ్డ, గెండి,
14.9. శిష్టవ్యవహారస్యరూవం :
జానపదులు సక్రమంగా విద్యావంతులైనప్పుడు శిష్టోచ్చారణను అనుకరిస్తారు. అసలు శిష్టోచ్చారణలో శిష్టత ఏ ధర్మాలవల్ల ప్రాప్తిచిందో తెలుసుకోవచ్చు. పై ఉచ్చారణ భేదాల్లో 1, 4, 5 7 చాలా వరకు అన్యదేశ్యాలకు చెందినవి. జానపదుల భాషలోకంటె చదువుకొన్న వాళ్ళ భాషలో సంస్కృత శబ్దాల వాడుక ఎక్కువ. పాఠ్యపుస్తకాలవల్ల, వార్తాపత్రికలవల్ల ఇది సాధ్యమవుతుంది. ఇంగ్లీషు మనదేశానికి రాకముందు చదువుకొన్న వాళ్ళంటే సంస్కృతం చదువు కొన్నవాళ్లే ఆనాటి నుంచి ఈనాటివరకు సంస్కృత భాషాజ్ఞానం మన సమాజంలో ఒకతరగతి భేదాన్ని సృష్టించింది. అలానే ఇంగ్లీషు తెలిసినవాడు సంస్కృతాంధ్రాలు తెలిసినవాడికన్నా సంస్కారవంతుడుగా పరిగణింపబడుతున్నాడు. దీనికి కారణం ఎక్కువభాషలు తెలిసినవాళ్ళు ఎక్కువ తరగతుల్లో కలిసిపోగలరు. ఎక్కువ మందితో వ్యవహారదక్షత ఏర్పడుతుంది. అల్పవ్యవహారపరిధిగల జానపదులకు అధికవ్యవహారదక్షతగల విద్యావంతులు ఆదర్శమై వాళ్ల భాష, కట్టు, నడవడి ఒరవడి అవుతాయి. వాటిని అనుకరించి జానపదులు నాగరకులనిపించుకోవటానికి ప్రయత్నిస్తారు. విద్యావిధానం, నగరజీవితం ఈప్రక్రియకు ఉపకరణాలవుతాయి. ఈనాడు క్రాపు, సూటు, బూటు, పెళ్లిళ్లలో దండలు వేసుకోవటం వగైరా రెండు సంస్కృతుల సమ్మేళనంలో అన్య సంస్కృతి నుంచి దేశీయ సంస్కృతిలో వచ్చిన మార్పులు. సమాజంలో వ్యక్తులకు తెలియకుండానే విలువలు మారుతుంటాయి. ఈ విలువల మార్పులో ప్రయోజనదృష్టి కొంతవరకు కనిపిస్తుంది. కాని, కారణాలు పూర్తిగా పరిశోధిస్తేనేగాని తెలియవు. ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ఈ ప్రక్రియ కనిపిస్తుంది. నార్మన్ దండయాత్ర తర్వాత ఫ్రెంచి జీవితవిధానం, ఫ్రెంచిభాష బ్రిటిష్ ప్రజలని, ఇంగ్లీషుభాషని ఎంతో ప్రభావితం చేశాము. అధికవ్యవహార దక్షత (ఎక్కువ మందితో మాట్లాడగల