పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమాండలికాలు : ప్రమాణభాష 407

సంబంధించినంతవరకు శిష్టశిష్టేతరులు మధ్యనున్న భేదాలు అన్ని భాషామండలాలకు సామాన్యమైనని ఎన్నో ఉన్నాయి. ఉచ్చారణనుబట్టే ఓకవ్యక్తి విద్యావంతుడు అవునోకాదో చెప్పవచ్చుగాని ఏకులస్థుడో చెప్పటం కష్టం. స్థూలంగా పైకులాలవాళ్ళు చదువుకున్నవారు కావటం, వెనకబడ్డకులాల్లో చదువు తక్కువగా ఉండటంవల్ల వర్గమాండలికాలు కులాశ్రయ ధర్మాలని కొందరు అపోహపడ్డారు. గాని అవి సరిఅయిన దృష్టికాదు. తక్కువ కులం వ్యక్తి చదువుకొన్న వాడైతే చదువృకొన్నవారి ఉచ్చారణ పూర్తిగా పట్టుబడుతుంది. శిష్టశిష్టేతరుల ఉచ్చారణులు ఈ కిందివిధంగా ఉంటాయి.

శిష్టోచ్చారణలో

1 (a) ఒత్తులు నిలుస్తాయి : భాగవతం, ధర్మం

(b) హకారం నిలుస్తుంది : హరివిల్లు, రోహిణి

2. అద్విరుక్త చకారం అంతటా నిలుస్తుంది : చవుడు, చుక్క, పలచన.

3. పదాది వకారం నిలుస్తుంది : (ఇ ఈ, ఎ, ఏల ముందు) విల్లు, వీధి, వెండి, వేడి.

4. సంయుక్త హల్లులు నిలుస్తాయి :

భక్తి. చేస్తాడు, కలెక్టర్‌

5. శ,ష, స, ల భేదం ఉంటుంది : శాస్త్రి, భాష, కాసు.

6. మూర్దన్య దంత మూలీయ భేదం నిలుస్తుంది :

పల్లం: పళ్లె౦, దాన్ని : వాణ్ణి

జాన పదోచ్చారణలో

1. (a) ఒత్తులు పోతాయి : బాగవతం, దర్మం

(b) హకారం పోతుంది : అరిల్లు, రోయిణీ

2. చకారం సకారం అవుతుంది:

సవుడు, సుక్కు, పలసన.

3. వకారం పోతుంది :

యిల్లు, యీది, యొండి, యేడి.

4. (a) హల్లులు సమీకరణం పొందుతాయి : బత్తి, సేత్తాడు.

(b) స్వరభక్తి రావచ్చు, కలకటేరు.

5. శ, ష లు సకారంగా మారతాయి: సేత్రి, బాస, కాసు.

6. మూర్దన్యాలు దంతమూలీయా లవుతాయి : శ > ల, ణ > న పల్లం: పల్లెం, దాన్ని : వాన్ని.