పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

406 తెలుగు భాషా చరిత్ర

వాడుతారు. (b) తెలంగాణాలో 'తుకం', 'నారు' రెండూ వాడేచోటమొదటి పదాన్ని 'వరినారు' అర్థంలోను, 'నారు' ఇతరమైన మొలకలకు వాడుతారు. 'తుకం' ఉర్దూనుంచి వచ్చి చేరిన ఇటీవలిమాట (చూ. మాం. వృ. కో 1.91).

(5) ఒకే అర్థంలో రెండు మాటలుండి, ఒకటి ఎప్పుడూ సమాసగతం గాను, మరొకటి వ్యస్త, సమస్త రూపాల్లోనూ వస్తుంటే, కేవల సమాన గతమైన రూపాంతరం ప్రాచీనమని గుర్తించాలి; ఉదా. చెవుడు కట్టెముల్లు, చెవుడు కర్ర చెవుడు దారం, చెవుడు పలుపు. దీని రూపాంతరం 'చేడు' వ్యస్తంగాను, సమాసాల్లోనూ కూడా వస్తుంది. దీని అర్థం 'నేస్తున్న గుడ్డ ముడుచుకు పోకుండా అడ్డంగా కిందివైపు బిర్రుపెట్టే కర్ర.

చెవుడు _, చెముడు-పదాలు కొన్ని చోట్ల రాయలసీమలోను, శ్రీకాకుళం లోను మాత్ర౦ వచ్చాయి. అంటే దేశ౦ అంతటా ఒకప్పుడు 'చెవుడు-' శబ్దమే ఉండి దాని సంక్షిప్తరూపంగా 'చేడు' ఏర్పడి ఉంటుంది. (చూ. మాం. వృ. కో 2, పుట 45; పటం. 5). 'చెవుడు-, చెముడు-' శబ్దాలన్నవి పురాతన వ్యవహార ప్రాంతాలు (relic areas) గా గుర్తించవచ్చు.

(6) ఇప్పుడు రాకపోకల సంబంధంలేని దూర ప్రాంతాల్లో ఒకమాట వాడుక పరిమితంగా లంకల మాదిరిగా కనిపిస్తే ఆ మాట అతిప్రాచీనమనీ, ఆ తరునాత వాడుకలోకి వచ్చిన అర్వాచీన రూపంపల్ల దీని వ్యాప్తి కాలక్రమాన సంకుచితమై పోతున్నదనీ ఊహించాలి. పైన (5) లో ఇచ్చిన ఉదాహరణ దీనికి సరిపోతుంది. శ్రీకాకుళంజిల్లాలో కొద్దిచోట్ల, రాయలసీమలో కొద్దిచోట్ల మాత్రమే 'పరిటె' అనేశబ్దం ఉంది. మిగిలినదేశ మంతటా 'పంటె' శబ్ద౦. ఈ రెండింటి పూర్వరూపం 'పరింటె' అయి ఉంటుంది. (ఇటువంటిదే. గంటె గరిటె < * గరింటె). పరిటె/పంటె 'చేత్తో నూలుచుట్టే పనిముట్లు' (చూ. మాం. వృ. కో. 249: పటం 9)

14.8. వర్గమాండలికాలు :

ఇంతవరకు నిరూపించిన మాండలిక విభాగం స్థిరవృత్తుల నాశ్రయించి బతికే జానపదుల వాడుక ఆధారంగా చేసింది. విద్యాగంధంలేని పామరులభాషకు చదువుకొన్న నడిమితరగతి వారి భాషకు మధ్య తేడాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవి ఉచ్చారణలోనుు వ్యాకరణంలోను, పదజాలంలోను ఉండవచ్చు. ఉచ్చారణకు