పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమాండలికాలు : ప్రమాణభాష 405

(1) నాలుగు మండలాల్లోనూ ఒకే శబ్ద౦ (రూప భేదోలున్నా) కనిపిస్తే (a) అది దేశ్యమయితే భాషామండలాలు ఏర్పడక పూర్వమే దేశమంతటా వ్యాపించి వాడుకలో నిలిచి ఉన్నట్టు గమనించాలి. (b) అది అన్యదేశ్యమైతే ఇటీవల మాత్రమే ఆధునిక వ్యవహారంలో వ్యాపించినదై ఉండాలి. ఉదా(a) పేడ/ పెండ; (b) పొరంబోకు/పోరంబోకు. కొన్ని ప్రాకృత భవాలు దేశ్యశబ్దాలులాగా ప్రాచీన కాల౦లోనే వ్యాప్తిలోకి వచ్చి నిలిచిపోయినవి ఉన్నాయి. ఉదా. గానుగ (< ప్రా.ఘాణ < సం. ఘాతన.)

(2) మూడు మండలాల్లో దేశ్యశబ్ధమూ,నాలుగోమండలంలో అన్యదేశ్యమూ ఉంటే, అన్యదేశ్యం ఇటీవల వ్యాప్తిలోకి వచ్చి అంతకు ముందున్న దేశ్యశద్దాన్ని తోసివేసినట్టు గ్రహి౦చాలి. తెలంగాణా, రాయలసీమల్లో కొంతమేర వాడుకలో ఉన్న 'తానె' అతను ముందున్న 'ఆసు' పదాన్ని తోసివేసి ఇటీవల వచ్చి ఉంటుంది. 'తానె' ఉర్దూ నుంచి వచ్చిన అన్యదేశ్యం (చూ. మా౦. వృ. కో. 2.43 పటం 3).

తెలంగాణా ఉత్తర ప్రాంతంలో 'పాలె' మిగిలిన దేశమంతటా ఉన్న 'మేడి, మేడితోక'కు పర్యాయం. ఇది మరాఠీ ప్రాంతంనుంచి వ్యాపించిన మాట (మరా. ఫాళ్ 'కర్రు' - అర్థ విపరిణామం).

(3) ఒక మండలంలో మాత్రమే దేశ్యపదం మిగిలి, ఇతర మండలాల్లో అన్య దేశ్యం ఉంటే, దేశ్యపదం ప్రాచీనం, అన్యదేశ్యం అర్వాచీనమని, సాంఘిక చరిత్రలో వచ్చిన మార్పులవల్ల అన్యదేశ్యం వ్యాపించి ఉంటుందని గుర్తించాలి. ఓక్క దక్షిణ మండలంలోనే 'కపిల/కపిలె' అనే మాట నిల్చి ఉంది. మిగిలిన దేశమంతటా 'మోట' (<హిం. మోఠ్). మోటకు: కవిలకు కట్టుబడి తేడాలుండ వచ్చు. (చూ. మాం. వృ. కో. 1.47-8, 67; పటం. 3).

(4) ఒకమండలంలో వాడే రెండు దేశ్యపదాలకు సరిగా మరోమండల౦లో ఒకేమాట వాడుకలో ఉంటే (a) రెండు మాటల అర్థమూ ఒకేపదానికి ఆరో పించటంవల్ల రెండోది జారిపోయి ఉండవచ్చు, లేదా (b) ఓక పదానికున్న అర్థం విరిచి రెండు పదాలకు దాన్ని ఆరోపించవచ్చు. ఉదా. (a) పూర్వమండలం (కళింగ దేశం) లో వరినారుకు 'ఆకు' అని, మిరప, పొగనారుకు 'నారు' అని రెండు మాటలుండగా మిగిలివ ప్రా౦తంకో ఈ రెంటికి 'నారు' అనే మాటనే