పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

404 తెలుగు భాషా చరిత్ర

కావ్యాల్లో అట్టే ప్రయోగాలులేవు. ('గునపం' మాత్రం ఎఱ్ఱాప్రగ్గడ హరి. ఉ. 2 : 16. లో ఉన్నట్టు సూ. ఆం. నిం.). పింగళి సూరన పూర్వులు గోదావరీ పరిసరాలనుంచి పలనాడు, పాకనాడు ప్రాంతాలకు వ్యాపించినట్లు ఈ కింది పద్యం: వల్ల తెలుస్తున్నది (ప్రభావతీ ప్రద్యుమ్నము, అవతారిక)

ఉ. రంగుగ గౌతమీ పరినరంబులఁ గృష్ట కెలంకులన్‌ ఘనుల్‌ పింగళి రామయాదులు లలింబలనాటను బాకనోటనుం బింగళి గాదయాదు లిటఁ బెంపువహించిన యస్మ దాదులా పింగళి గోకమంత్రి యిలుపేరనే చాలఁ బ్రసిద్దు లెల్లచోన్‌”

ఈ పద్యంలో 'ఇట' ఏ ప్రా౦తమో తెలియటంలేదు (చూ. చాగ౦టి శేషయ్య 10. 99 [1953]). 'గునపం' అనేమాట వాడుక ఇప్పుడు పూర్వాంధ్రం,తూర్పు గోదావరి ప్రాంతానికి మాత్రం పరిమితం. ఇతర ప్రాంతాల్లో గడ్డపార, గడ్డపలుగు శబ్దాలున్నట్లు మాండలిక పరిశోధనలో తెలిసింది. (చూ. మాం. వృ. కో. 4.72; పటం 16). గోదావరి మాండలికపదం వాడుకనుబట్టి పింగళి సూరన మద్యా౦ధ్ర మండలం నుంచి తరవాత దక్షిణాంధ్రానికి వచ్చినట్టు ఊహించవచ్చు. ఇతని తండ్రి కృష్ణాజిల్లాలోనికి 'నిడిమానూరు' అగ్రహారికుడు. కళాపూర్జోదయ కృతికర్త నంద్యాల కృష్ణమరాజు దక్షిణ మండలంలో ఉన్నవాడు.

అదేవిధంగా 'మోట' అనే అర్థంలో 'కపిల' శబ్దం నెల్లూరు ప్రా౦తంలో వాడుకలో ఉన్నది. తిక్కన భారతంలోనే దీనికి ఏకైకప్రయోగం కనిపిస్తున్నది. (భారతం, అశ్రమ. 1.72).

“కుడువ నిచ్చు తఱియుహఁ గురువర క్రక్కించు నవసరంబు నెఱిఁగి యరినృపాలు నీవు ధీరవృత్తి నిడుఁద్రాట బోనిమ్ము క్రమ్ము కపిల యనఁగ గ్రమ్మి చెఱుపు."

(మాండలిక పదపరిశీలన ప్రయోజనాల వివరాలకు చూ. మాం. వృ. కో. 1.30-46.)

14.7. మాండలిక పటాలు ఆధారంగా ఆయా పదాల స్థూలచరిత్రను ఈ కిందివిధంగా గుర్తించవచ్చు.