Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

398 తెలుగు భాషా చరిత్ర

నోటనే వినవస్తాయి. ఇంతేగాక వృత్తులనుబట్టి, వక్తృశ్రోతల పరిచయాన్ని, సందర్భాన్ని బట్టి వాడుకలో మార్పులు కనిపిస్తాయి. తెలుగు మాతృభాషగా మాట్లాడే వాళ్ళతీరు ద్వితీయభాషగా మాట్లాడేవాళ్ళతీరు వేరుగా ఉంటాయి. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రాంతీయవర్గమాండలికాల స్వరూపమూ, వాటికీ ప్రమాణభాషకూ ఉన్న సంబంధమూ ప్రధానంగా చర్చిస్తాను.

14.1. నేటితెలుగులో భాషామండలాలు :

వృత్తిపదపరిశోధన ఆధారంగా తెలుగునాడును నాలుగు భాషామండలాలుగా విభజించవచ్చునని తేలింది. అవి : (1) పూర్వమండలం (కళింగదేశం : శ్రీకాకుళ, విశాఖపట్టణం జిల్లాలు), (2) దక్షిణమండలం (రాయలసీమ, నెల్లూరు, ప్రకాశ౦ జిల్లాలు), 3. ఉత్తరమండలం (తెలంగాణా; మవహబూబ్ నగఠ్‌, ఖమ్మం, జిల్లాల్లో కోస్తా రాయలసీమలను అనుకొన్న తాలూకాలు ఆయాభాషా మండలాల్లో కలుస్తాయి), (4) మధ్యమండలం (ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణాజిల్లాలు) ఈ కింది వృత్తిపదాల్లో ఆయా మండలాలకే పరిమితమైన విలక్షణ శబ్దాలు 'ఇటాలిక్సు' లో సూచించబడ్డాయి.

1. పూర్వ 2.దక్షిణ 3. ఉత్తర 4. మధ్య మండలం మండలం మండలం మండలం (కళింగ) (రాయలసీమ) (తెలంగాణా) (ఇతర కోస్తాలు)


1. ... తువ్వనేల దుబ్బనేల తువ్వనేల

2. మోట కపిల మోట మోట

3. మదుం తూము తూము తూము

4. వూజు/పూదు కాడిమాను/... కా౦డి/కాణి/కాని కాడి

5. నాగలి నాగేలి/మడక నాగలి నాగలి

6.. మేడి మేడితోక పాలె మేడి

7. నక్కు కర్రు/కారు కర్రు కర్రు

8. ఏటికర్ర వొగ/నగ... ఏటికర్ర/ఏటికోల ఏడికర్ర

9. పేడ పేడ పెండ పేడ