Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

తెలుగు భాషా చరిత్ర


క్రియాజన్య విశేషణాలమీద కొన్ని అవ్యయాలు కూడా చేరి క్రియావిశేషణా లుగా గాని, వాక్యవిశేషణాలుగా గాని ప్రవర్తిస్తాయి. . ఆతను వచ్చినప్పుడు, ఆతను చెప్పినందుకు, నువ్వు అన్నట్లు, ఆమెవచ్చేముందు ఇట్లాంటివి ఇంకా సాధ్యాలు.

క్రియాజన్య విశ్లేషణాల తరవాత (ఏ విశేషణాల తరవాతయినా) తదర్థ బోధకమైన సర్వనామాలు మాత్రమే రాగలవు. తదర్థకశబ్దరూపమున్నా తదర్థ బోధకత ఉండదు. ఉదా : వచ్చినవాడు; * వచ్చినవీడు; మంచివాడు; మంచివీడు

13,20. సంయుక్త వాక్యాలు : కొన్ని ప్రధాన వాక్యాలు కలిపి సమ ప్రతిపత్తి ఉన్న దళాలతో ఏక వాక్యం చెయ్య లేము. భిన్నవాక్యాలు భిన్నవాక్యాలు గనే ఉంటాయి. లేకపోతే క్త్వార్థక వాక్యాల్లాగా ఉపవాక్యాలన్నా అవుతున్నాయి, కానీ, అయితేవంటి కొన్ని అవ్యయాలు రెండు వాక్యాలను అనుసంధించగలవు. -అయితే అట్లా అనుసంధించ బడ్డ వాక్యాలు ఏకవాక్యమయినట్టు ఆధారాలు తక్కువ. ఉదా : అతను చదువుతాడు. కాని తల కెక్కదు; అతను వచ్చాడుగాని ప్రయోజనం లేదు; అతను డబ్బుగలవాడు, అయితే గర్వం లేదు.

రేండు ప్రశ్నార్థక వాక్యాలు ఒకచోట చేరిస్తే వాక్యాల అర్థాలను బట్టి సముచ్చ యార్థకాలుగాని: వికల్పకార్థకాలుగాని కావచ్చు. ఉదా : అతను ఎక్కడ ఉంటు న్నాడు? ఏంజేస్తున్నాడు? ఆతను ఇవ్వాళ మద్రాసు వెళ్తున్నాడా? గుంటూరు వెళ్తున్నాడా?

ఇంగ్లీషు హిందీ భాషల్లోలాగా రెండు వాక్యాల్ని కలిపే సముచ్చయార్థక, వికల్పార్థక శబ్దాలు తెలుగులో లేవు.

నామబంధాలను మాత్రంచివరి స్వరాలకు దీర్ఘీకరించటంద్వారా ఏకనామ బంధం చెయ్యవచ్చు. ఉదా : లలితా సుబ్బారావూ కలిసివచ్చారు.

నామబంధాలకు 'ఓ' శబ్దంచేరిస్తే వికల్పార్థంలో కలపవచ్చు. రామారావో సుబ్బారావో వస్తారు.

[వాక్యనిర్మాణానికి సంబందించి ఇందులో చెప్పని కొన్ని విశేషాలు తెలుగు వాక్యం అనే పుస్తకంలో దొరుకుతాయి ]