ఆధునికభాష : సంగ్రహవర్ణనం 395
అటం చేర్చగా ఏర్పడిన వాటిని బావార్థక నామాలంటారు. నామాలకులాగే వీటికి విభక్తిప్రత్యయాలు చేరతై .
ప్రధాన ఉపవాక్యాల్లో కర్త ఒకటేఅయినప్పుడు ప్రయోజనార్ధంలో అట మంత నామానికి 'కి' విభక్తి చేరుతుంది. ఉదా : మాఆవిడ నాతో పోట్లాడటానికి సిద్ధమవుతున్నది.
ప్రధానక్రియ మనోవ్యాపారబోధకమైనప్పుడు 'కి' విభక్తి చేరిన అటమంత నామం హేత్వర్థకమవుతుంది. ఉదా: ఆమె తెలుగులో మాట్లాడటానికి సిగ్గుపడుతుంది.
'తో' చేరిన అటమంతనామం పూర్వవ్యాపార సమాప్తిని సూచిస్తుంది. స్ధితి బోధకక్రియల నుంచి నిష్పన్నం చేసిన అటమంత నామలకి యోగం లేదు. ఉదా. అతను అన్నం తినటంతోనే నిద్రపోతాడు. ఆమె అందంగా ఉండటంతోనే ఇతను ప్రేమించాడు.
13.19. క్రియాజన్య విశేషణాలతో నామ్నీకరణాలు: కొన్ని వాక్యాలు నామపదాలకు విశేషణాలుగా ప్రవర్తిస్తాయి. ఇట్లాంటి విశేషణవాక్యాల్లో క్రియ విశేషణరూపంగా మారుతుంది. ప్రథాన వాక్యంలో నామపదంతో సరూపమైన ఉప వాక్యంలో నామం విభక్తితోసహా లోపిస్తుంది. అందువల్ల వీటిని లుప్తవిభక్తిక నామ్నీకరణాలనికూడా అనవచ్చు. ఇట్లా విభక్తి లోపించినా అర్ధగ్రహణంతో బాధ లేదు. అయితే అన్ని విభక్త్యర్దాల్లోనూ ఈ నామ్నీకరణాలు సాధ్యంకావు. ఉదా :
ఆ అబ్బాయి ఊరికివెళ్ళాడు--> ఊరికి వెళ్ళిన అబ్బాయి; అతను ఇడ్డెన్లు తిన్నాడు --> అతనుతిన్న ఇడ్జెన్లు; వాడు కొడవలితో గడ్డికోశాడు--> వాడు గడ్డి కోసిన కొడవలి; వాడు సీతతో వచ్చాడు --> * వాడువచ్చిన సీత; అతను ఆ అమ్మాయికి ఉత్తరంఇచ్చాడు--> అతడు ఉత్తరంఇచ్చిన అమ్మాయి. వాడు చల్లకు వచ్చాడు--> *వాడువచ్చినచల్ల. అతను మార్కెాట్‌నుంచి పూలుతెచ్చాడు -->అతను పూలుతెచ్చిన మార్కెట్; అతను ఊరినుంచివచ్చాడూ -->* అతను వచ్చిన ఊరు; ఆమె పెట్టెలో డబ్బు దాచింది -->* ఆమెడబ్బుదాచిన పెట్టె; వాడు వాళ్ళలో మంచివాడు -->* వాడు మంచివాడయిన వాళ్ళు;
వీటిలో పువ్వుగుర్తులుంచిన నామబంధాలు అవిష్పన్నాలు. విభక్తి ప్రత్యయం ఒకటే అయినా అర్థభేదాలవల్ల కొన్ని నామబంధాలు నిష్పన్నంకావు.