Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 291

ఈ కింది వాక్యాలు వ్యాకరణవిరుుద్ధాలు. *అతను వానకురిసి , ఇంటికి వచ్చాడు; * అతను ఎండకాసి బయటికివెళ్ళాడు, * అతను ఫ్యాక్టరీ కూతకూసి నిద్ర లేచాడు.

శత్రర్థక౦ : ప్రథాన క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచించటానికి ఉపవాక్యంలో క్రియ శత్రర్ణకరూపంలో ఉంటుంది. ప్రథాన అప్రధానక్రియలు రెండూ ఏకకర్తృకాలై ఉండాలి. ఉదా : అతను కాఫీ తాగుతూ పేపరు చదువుతుున్నాడు.

శత్రర్థక క్రియలు ప్రధానక్రియకు రీతి విశేషణాలుగాకూడా. ప్రవర్తిస్తాయి. ఉదా : అతనెప్పుడూ నవ్వుతూ పలకరిస్తాడు.

అవ్యర్థతం : రెండు వ్యాపారాల్లో వైరుధ్యమున్నప్పుడీ వాక్యాలుపయోగిస్తారు. ధాతువునకు - ఇనా ప్రత్యయం, చేర్చటంవల్ల అప్యర్థక క్రియలేర్పడతాయి. ఉదా : అతను వచ్చినా ఫలితముండదు; వాడు రాకపోయినా పరవాలేదు.

చేదర్థఠం ; ఇక వ్యాపారంమీద ఆధారపడి ఇంకో వ్యాపారం జరిగినప్పుడీ వాక్యాలుపయోగిస్తారు. తే, ఇతే ప్రత్యయాలుచేరిస్తే చేదర్థక క్రియలు ఏర్పడతాయి. ఉదా : మా ఇంటీకొస్తే డబ్బిస్తాను; నేను బజారుకు వెళితే తెస్తాను.

'జరగవలసింది జరగలేదు' అనేభావాన్ని వ్యక్త౦ చెయ్యటానికిక్త్వార్థకక్రియ మీద ఉండు ధాతువుయొక్క చేదర్ధకరూపం చేరుతుంది. ఉదా : నువ్వునిన్నవచ్చి ఉంటే డబ్బు ఇచ్చేవాడిని. ఇక్కడ ప్రధాన క్రియనుకూడా చేదర్థక సమాపక క్రియగా భావించవచ్చు. శబ్దరూపం క్రియాజన్య విశేషణంనుంచి నిష్పన్నమైన నామమైనా వాక్య౦లో దీని ప్రవర్తన నమాపకక్రియే.

సంభావ్యమాన వ్యాపారాలున్నప్పుడే చేదర్థం సాధ్యమవుతుంది. సమాప్తినందిన వ్యాపారాలమధ్య ఈ బోధ ఉండదు.

ఉదా : వానలు "కురిస్తే పంటలు పండుతాయి పైసలుంటే దోసె తినేవాణ్ణి.

పై వాక్యాల్లో భూతకాలిక క్రియటు వాడేతే కలిగేది చేదర్ధబోధకాదు. చేదర్ధ బోధలో పై వాఖ్యాల్లో భూతార్థ బోధకు ఉండు దాతువుననుప్రయుక్తం చెయ్యవచ్చు.

పైసలుండి ఉంటే దోసే తినేవాణ్ణి కాని