390 తెలుగు భాషా చరిత్ర
2. కొన్ని క్రియలతో క్త్వార్ధకం హేత్వర్థక మవుతుంది. ఉదా : అతను జ్వరంవచ్చి పడుకున్నాడు. అతడు తిండి తినక చిక్కిపోయాడు.
3. కొన్ని క్రియలతో రీత్యర్థక క్రియావిశేషణం అవుతుంది. ఉదా : అతను లంచాలు తిని సంపాయించాడు. అతను రిక్షాలాగి బతుకుతున్నాడు.
4. కాల బోధక సామాన్యవాక్యానికి ఉపవాక్యంగా-అతను స్నానంచేసి వారంరోజులయింది. పై వాక్యానికి ఈ కింది వాక్యంతో తుల్యార్ధక బోదకత ఉంది. అతను వారం రోజుల కిందట స్నానం చేశాడు.
ప్రధానవిషయబోధలో ఈ వాక్యాలు వ్యతి రేకక్త్వార్థకంతో అంతగా వేదించవు. ఉదా : అతను స్నానంచేసి వారంరోజూలయింది. అతనుస్నానంచేయక వారంరోజులయింది.
కాని అన్ని క్రియలతోను ఈ వ్యతిరేకవాక్యాలు సాధ్యంగావు, * అతనికి పెళ్ళికాక రెండేళ్ళయింది; * అతనికి మశూచికం రాక ఐదేళ్ళుయింది; * వాడు చావక ఆరునెలలయింది; * ఆమె అందంగా ఉండి ఐదేళ్శయింది. పునఃపునస్పంభవ యోగంలేని క్రియలు వ్యతి రేకక్త్యార్థక రూపంతో ఈ వాక్యాల్లో రాలేవు.
5. క్త్యార్థకరూపద్విరుక్తి వ్యాపారాధిక్యాన్ని తెలియజేస్తు౦ది. వ్యతిరేక క్తార్థకద్విరుక్తి కాలధైర్ఘ్యాన్ని సూచిస్తుంది. ఉదా : చెప్పిచెప్పి నానోరు పడిపోతున్నది; రాకరాక వచ్చాడు.
6. జడవాచకకర్తృపదాలతో క్త్వార్ధకం పరిణామ సూచకమవుతుంది. అద్దం కిందపడి పగిలింది.
7. ప్రకృతిలో సహజ సిద్ధంగా వ్యాపారాలతో క్త్వార్ధకం హేత్వర్థకమవుతుంది. ఉదా: వానలు కురిసి చెరువులు నిండినాయి; తుఫానువచ్చి పడవలు మునిగినాయి; గాలివానవచ్చి మామిడిపండ్లు రాలిపోయినాయి.
8. కాలబోధకంగా కొన్ని క్త్వార్ధకరూపాలున్నాయి. ఉదా : పొద్దెక్కి నిద్దర్లేచాడు. పొద్దుగూకి చుట్టాలువచ్చారు. చీకటిబడి ఇంటికీ వెళ్ళాడు.
నియతంగా జరిగే ప్రకృతి సహజమైన - వ్యాపారాల్ని బోధి౦చే క్త్వార్థక క్రియలున్నపుడే ఈ వాక్యాలు సాధ్యం.