ఆధునిక భాష : సంగ్రహవర్ణనం 389
ప్రశ్న: 1. వాక్యాంతశ్శబ్దాపేక్షక ప్రశ్నలు 2. వాక్యేతర శబ్దాపేక్షక ప్రశ్నలు 3. విషయనిర్థారక ప్రశ్నలు అని మూడు రకాల ప్రశ్నలు సర్వభాషల్లోను ఉంటాయి.
వాక్యానికి '-ఆ' అనే అపదం చేర్చటంవల్ల వాక్యాంతశ్శబ్దాపేక్షక ప్రశ్నలేర్పపడతాయి. ఉదా : ఆయన ఊరినుంచి వచ్చాడా ? సమాధానం వచ్చాడు లేక రాలేదు అని ఉంటుంది.
ఎవరు, ఎందుకు, ఎప్పుడు వంటి కిమర్థబోధక శబ్దాలతో వాక్యేతరశబ్దాపేక్షక ప్రశ్న లేర్పడతాయి. ఆయన ఊరినుంచి ఎప్పుడు వస్తాడు ? రేపు, ఎల్లుండి, నెలరోజుల తరవాత వంటి పదాలు సమాధానాల్లో ఉంటాయి.
కదా, కదూ వంటి అపదాలు వాక్యానికి చేర్చటంవల్ల విషయ నిర్ధారక ప్రశ్నలు ఏర్పడతాయి. ఆయన నిన్న ఊరినుంచి వచ్చాడుకదూ ? ఈ వాక్యంలో 'ఆ మనిషి నిన్న ఊరినుంచి వచ్చాడు' అన్న విషయల వక్తకు పూర్వమే తెలుసు. ఆ విషయం నిర్ధారణ చేసుకోవటానికి అడిగిన ప్రశ్న.
కర్మప్రధానవాక్యాలు : కర్మ పదాన్ని ఉద్ధేశ్యంచేసి కర్తృపదాన్ని విధేయంలో భాగంగాచేసి చెప్పే వాక్యాలు కర్మ ప్రధానవాక్యాలు. ఉదా : అతను వ్యాసం రాశాడు; వ్యాసం అతనిచేత రాయబడింది.
గుప్త కర్తృ, కర్మలు వ్యక్త నిర్మాణంలో వ్యత్యస్తమైతే కర్మప్రధాన వాక్యాలు ఏర్పడతాయి. ఈ రకపు వాక్యాలు ఆధునిక వాగ్వ్యవహారంలో చాలా అరుదు. రచనా వ్యవహారంలో కనిపిస్తాయి.
13.16. సంశ్లిష్ట వాక్యాలు : అసమాపకక్రియాయుక్త ఉపవాక్యాలు చేరిన సామాన్యవాక్యాలు సంశ్లిష్ట వాక్యాలవుతాయి.
క్త్వార్ధక : 1. సమానకర్తృకమైన రెండుక్రియల్లో పూర్వక్రియ క్త్వార్ధకమై ఉంటుంది. ఉదా : అతను ఇంటికివెళ్ళి కాఫీ తాగాడు, ఈ వాక్యాలిట్లా౦టి అర్థంలో భిన్న కర్తృకం కావటానికి వీల్లేదు.
- రామారావు అన్నంతిని సుబ్బారావు కాఫీ తాగాడు.
కాని పరస్పర విరుద్ధార్ధబోధ ఉన్నక్రియలు వాడినప్పుడు భిన్నకర్తృకత సాధ్యమే. ఉదా: ఇటీవల ఎన్నికల్లో కా౦గ్రెసు ఓడిపోయి జనతాపార్టీ గెల్చి౦ది.