388 తెలుగు భాషా చరిత్ర
విధి, ప్రశ్నాదిక భేదాలు : వాక్యాల్లో విధి-నిర్వధి, ప్రశ్న-అప్రశ్న. కర్తృప్రధాన-కర్మ ప్రధాన భేదాలుకూడా ఉన్నాయి.
విధీ : విధీ వాక్యాల్లో కర్తృపదం మధ్యమపురుషలో ఉంటుంది. కర్తకు వ్యాపారాదేశంచేసే వాక్యాలు విధి వాక్యాలు, విధి వాక్యాలెప్పుడూ భవిష్యద్బోధకాలే. విధిలో క్రియ ధాతురూపంలో ప్రయుక్తమవుతుంది.
(1) అనియతా దేశంఉన్న ధాతువులకు ఆదేశరూపమే విధిలో ఉపయుక్తమవుతుంది. ఉదా : రా, పో, తే, చూడు, చావు మొ.
(2) ఆదిస్వరం దీర్ఘమైఉండి 'యు' అంతలోఉన్న ధాతువులకు చివరి 'ఉ' 'ఇ' గా మారి అకారేతర దీర్ఘస్వర, యకారాలకు హ్రస్వస్వర ద్విరుక్త యకారాలవుతాయి. ఉదా : చేయు-చెయ్యి, కోయు-కొయ్యి; రాయు-రాయి.
రెండక్షరాల ధాతువులో చివరి అక్షరమైన 'చు' కొందరి భాషలో 'య' గా గ్రహించాల్సి ఉంటుంది. తూచు, తోచు, దాచు, ఇట్లా౦టివి.
(3) మూడక్షరాలధాతువుల్లో చివరి చు, యులకు 'వు' అవుతుంది. ఇన్మధ్యం ఉన్మధ్యం అవుతుంది ఉదా : పిలుచు-పిలువు, కలియు-కలువు.
(4) ఉచ్చారణవేగంతో చివరి వ్యంజనాలయిన య, వ ల తరవాతీ అచ్చు లోపిస్తుంది. ద్యిరుక్తయవర్ణ౦ అద్విరుక్తమవుతు౦ది. ఒక్కొక్కప్పుడు. చివరి 'వ' వర్ణం పూర్వస్వరానికి దీర్ఘ౦గా మార్చవచ్చు. అంటే-ఉవ్ కి ఊకి భేదం సన్నగిల్లిపోతుంది. చెయ్యి > చెయ్య్ > చెయ్; పిలువు > పిలువ్ > పిలూ.
ఎరుగ్వాదులకు విధిలేదు. ఎరుగు, చెడు, జంకు, జడియు, తగు, నచ్చు, నట్టు, బెదురు మొదలైన ధాతువులు చాలా వాటికి విధిలో ప్రయోగం ఉండదు. కొన్ని ధాతువులకు కొను ప్రత్యయంచేరిస్తే విధిలో ప్రయోగార్హాలు. ఉదా తెలియ- తెలసుకో.
విధీ ఏకవచన క్రియారూపానికి అండి ప్రత్యయంచేరిస్తే బహువచనరూప మేర్చడుతుంది. దీర్ఘ స్వరాంత ధాతువులతరవాత ఈ ప్రత్యయాదిస్వరంలోపిస్తుంది. కొందరిభాషలో దీర్ఘ౦ హ్రస్వమవుతుంది. రా+అండి > రాండి > రండి. కొన్ని నిర్విధివాక్యాలు విధిబోధకాలుకావచ్చు. ఉదా : మీరిక బయటికి దయచెయ్య వచ్చు. మా అమ్మాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి.