386 తెలుగు భాషా చరిత్ర
ఏకవచన బహువచన ఉత్తమ ను.ని ము,మ్, మి మధ్వమ వు,వి
నామ విభక్తులలో ను-ని, కు-కిల మధ్య భేదం లాంటిదే ఇక్కడి ను-ని, వు-వి, ము-మిల మధ్యభేదం సిద్ధ, సాధ్య ఇకారాంతశబ్ధాల తరవాత 'ని, వి, మి' లు మాత్రమే ఉంటాయి. మిగతా అచ్చుల తరవాత వికల్పంగా ఏవైనా రావచ్చు. 'మి' అట్లారాదు. ఉదా. నేను మనిషిని; నువ్వుస్త్రీవి; మీరు పురుషులు; మీరు స్త్రీలు; మనం మనుషులం; నేను తెలుగు వాడిని; నువ్వు తెలుగు దానివి; మేం తెలుగువాళ్ళం; మనం తెలుగువాళ్ళం; మేం పదిమందిమి.
స్త్రీవాచకాన్ని బోధించే 'ది' ప్రత్యయానికి 'అది' శబ్దానికి లాగా ప్రత్యయాలముందు 'దాని' అనేరూపం ఆదేశమవుతుంది.
విశేషణాల తరవాతవచ్చే వాడు, వారు, ది, వి ప్రత్యయాలకు వాటితో సరూపమైన సర్వనామాలకు ఔపవిభ కిక రూపాలుంటాయి. వాడు-వాడి, వారు- వారి, వాళ్ళు-వాళ్ళ, ది-దాని, వి-వాటి.
ప్రత్యయమాత్రమై విశేషణాల తరవాతవచ్చే పై శబ్దాల్లో తదర్థబోధకత లేదు. ఇదమర్థబోధక సర్వనామరూపాలిక్కడరావు.
ఈ క్రియారహితవాక్యాలు ఉపవాక్యాలు (subordinate clauses) గా ప్రయుక్తమయినప్పుడు 'అవు' ధాతు రూపాలను అనుబంధించుకోవాలి. ఉదా : అతను మంచివాడు అయితే; అతను ధనవంతుడయినా గుణవంతుడు.
విధేయనామానికి 'కాదు' అనే రూపం అన్నిపురుషల్లోను అనుబంధించటం వల్ల వ్యతిరేకరూపాలేర్పడతాయి. కా- అనే 'అవు' ధాతువుయొక్క అన్నంత రూపానికి క్రియా విభక్తులు ఆయాపురుషల్లో చేర్చటంవల్లకూడా వ్యతిరేకరూపాలు ఏర్పడతాయి. అతను చెడ్డవాడుకాదు, కాడు.
'ఉండు' ధాతు నిష్పన్న క్రియారూపాల లోపంవల్ల కూడా కొన్ని క్రియారహిత వాక్యాలేర్పడతాయి. ఉదా : ఆయనకు ముగ్గురు పిల్లలు. ఆమెకు సిగ్గు ఎక్కువ. ఆ బావి చాలా లోతు.