ఆధునికభాష : సంగ్రహవర్ణనం 385
అఖ్యాతం (predicate) ఉంటుంది. ఒక సామాన్య వాక్యానికి అసమాపక క్రియారూపాలున్న ఉపవాక్యాలు చేరిస్తే సంశ్లిష్టవాక్యాలు ఏర్పడతాయి. కొన్ని సామాన్యవాక్యాలను ఒకచోట చేరిస్తే సంయుక్త వాక్యాలేర్పడతాయి.
సామాన్యవాక్యాలు : తెలుగులో సామాన్యవాక్యాలు క్రియరహితాలు, క్రియాసహితాలు అని రెండు రకాలు.
క్రియారహితాలు : ఏక పదార్థ బోధకమైన రెండు నామాలు ఒకచోట చేరిస్తే క్రియరహితవాక్యాలు ఏర్పడతాయి. ఈ వాక్యాల్లో మొదటినామం ఉద్దేశ్యం; రెండోనామం విధేయం. మొదటినామం సాధారణంగా సర్వనామంగాని, విశేష నామంగాని అయి ఉంటుంది. సర్వనామం విశేషణంగాఉన్న నామంకూడా ఉండవచ్చు. రెండోనామం సిద్ధనామంగాని, విశేషణాదులనుండి నిష్పన్నమైన నామంకాని కావచ్చు.
అతను వెంకటేశ్వరులు ఈమె సుజాత ఆయన డాక్టరు అది ఎర్రగుర్రం ఆ కుర్రవాడు మంచివాడు ఆ అమ్మాయి తెలివైనది ఆ కలం నాది ఈ అమ్మాయి అందమైనది
విశేషణాదులకు ఈ కింది ప్రత్యయాలు చేర్చటంవల్ల నామాలు నిష్పన్న మవుతాయి.
ఏకవచన బహువచన మహత్తు వాడు వారు, వాళ్ళు (మహన్మహతి) అమహత్తు ది వి (అమహత్తు)
ఉదా : మంచివాడు, మంచివారు, మంచివాళ్ళు, మంచిది, మంచివి.
ఉత్తమ మధ్యమపురుష సర్వనామాలు ఉద్దేశాలుగా ఉన్నప్పుడు విధేయ నామం ఆయా పురుషలను బోధించే ప్రత్యయాలను గ్రహిస్తుంది. అవి:
(25)