Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

384 | తెలుగు భాషా చరిత్ర

iv. దీర్ఘస్వరాంతధాతురూపాలకు 'అటం' చేరినప్పుడు 'వ' కారం ఆగమంగా వస్తుంది. ఉదా: రా + అటం > రావటం, తే+అటం > తేవటం, తీసుకో + అటం > తీసుకోవటం.

v. దీర్ఘస్వరాంత ధాతువుల తరవాత స్వరాదిప్రత్యయాల స్వరానికి లోపం జరుగుతుంది. కొందరి భాషలో అటం లోని మొదటి అచ్చుకూడా లోపిస్తుంది. అపుడు పై సూత్రంలో వచ్చే వ కారాగమం జరగదన్నమాట, 'వ' ఆగమంగా వస్తుంది. ఉదా : రా+అక > రాకు, తే + అక > తేక.

vi (a) అన్నంత క్రియా రూపాల తరవాత పరుషాలు సరళాలవుతాయి. ఉదా : రాన్‌ + కలడు > రాగలడు, పోన్‌ + కూడదు > పోగూడదు,చెప్పన్‌ + పట్టి > చెప్పబట్టి.

(b) సరళాదేశానంతరం 'న; కారానికి వ్యంజనాల ముందులోపం జరుగుతుంది. ఉదా :; చెప్పన్‌ + వచ్చు > చెప్పవచ్చు > చెప్పొచ్చు, రాన్‌ + వచ్చు > రావచ్చు > రావొచ్చు. (వ>ఒ>వొ)

కొన్ని స్వరాదిపదాలు పరమైనప్పుడుకూడా ఈ నకారానికి వికల్పంగా లోపం. జరుగుతుంది. ఉదా : చెప్పన్‌ + అవసరంలేదు > చెప్పనవసరంలేదు. చెయ్యన్‌ + అక్కర్లేదు > చెయ్యక్కర్లేదు.

కొన్ని స్వరలోప, సమీకరణకార్యాలు భిన్నమాండలికాల్లో భిన్న విధాలుగా ఉన్నాయి.

i. అన్వాది ధాతువులకు పరంగా వచ్చినపుడు భూతకాల బోధకమైన ఇన ప్రత్యయంలో ఇ లోపిస్తుంది. ఉదా:. అను+ఇనా+డు>అన్నాడు.

ii. 'ది' ప్రత్యయంముందు స్వరలోపం భిన్నవిధాలుగాజరిగే అవకాశం ఉంది. ఉదా : తిను + ఇనది>తిని౦ది, తిన్నది.

iii. భవిష్య౦లోకూడా కొన్ని గుర్తించదగిన భేదాలున్నాయి ఉదా: వచ్చు + త + ది > వచ్చుద్ది, వస్తది; కొట్టు + త + ది > కొట్టుద్ది, కొడతది; చెప్పు + త + ది > చెప్పుద్ది, చెపుతది.

13. 14. వాక్యనిర్మాణ౦ : వాక్యాలు సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయక్తవాక్యాలు అని మూడు విధాలు. సామాన్యవాక్యాల్లో ఒకే