పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 383

vii. ధాతువు చివరి వ్యంజనమైన ద్విరుక్త 'ట' వర్ణానికి అభూతాది ప్రత్యయాలముందు 'డ' వర్ణాదేశం అవుతు౦ది. ఉదా : కొడితే. కొడతాడు, కొడదాం. నట్టు, మెట్టులకు ఈ కార్యం జరగరు. ఉదా: నట్టుతూ మాట్టాడాడు, మెట్టితే.

viii. న్ను, ళ్ళు, ప్పు అంతంలో ఉన్న ధాతువులకు అభూతాదిక ప్రత్యయాల ముందు తుది ద్విరుక్త వ్యంజనం అద్విరుక్త మవుతుంది. ఉదా : తన్ను : త౦తాడు, తంతే. వెళ్ళు : వెళ్తాడు, వెళ్తే. చెప్పు ; చెప్తాడు, చెప్తే. అయితే ఈ కార్య౦ జరగని ధాతువులే ఎక్కువ, ఉదా : దున్ను, మన్ను, కుళ్ళు, మళ్ళు; తప్పు, తిప్పు, దెప్పు రొప్పు, విప్పు.

ix. స్వరసమత : మూడక్షరాల ధాతువుల్లో ప్రత్యయాది అ, ఇల ననుసరించి ధాతువుల్లో ప్రథమేతరాచ్చులుకూడా క్రమంగా అ, ఇలుగా మారతాయి. ఉదా ఏ అడుగు : అడగ, అడిగి; కరగు : కరగ, కరిగి. 'తెలియు' కు : తెలీదు, తెలియదు, తెలవదు అనే రూపొలున్నాయి.

x. కొన్ని ధాతువులకు ఆదేశరూపాలు (suppletive forms) ఈ కింది విధంగా ఉన్నాయి. ఇవి విధ్యాది ప్రత్యయాలముందే ఇట్లా ఉంటాయి. వచ్చు : రా, తెచ్చు : తే, ఇచ్చు : ఇయ్యి, ఇవ్వు, ఆపు : కా, అవ-, చూచు; చూడు, లేచు; లే, లేవ-, చచ్చు : చావు, పోవు : పో.

xi. పడుధాతువు భూతాదికప్రత్యయాలతో కలిసి రూపాలు ఇట్లా ఉంటాయి. పడు : పడ్డాడు, పడ్డా, పడినా. చెడుధాతువులకు కూడా ఇంతే. ప్రాచీనభాషలో ఇడు ఈ తరగతికి చెందినదే.

13.13. ప్రత్యయాల్లో మార్పులు : i. అన్వాది ధాతువుల తర్వాత, ప్రత్యయంలో 'త' వర్ణం మూర్ధన్యమైన 'ట' వర్ణమవృతుంది. అను, కను, కొను, తిను, విను-ఇవి అన్వాదులు, అను : అంటే, అంటాడు, అంటున్నాడు.

ii. కాలబోధక ప్రత్యయాల్లో చివరి 'అ' కారానికి దివీతర ప్రత్యయాల ముందు రాయలసీమ, సర్కారుజిల్లాల వ్యవహారంలో దీర్ఘ౦ వస్తుంది. ఉదా: చేయు : చేసినాడు, చేస్తాడు. తెలంగాణంలో చేసిండు, చేస్తడు.

iii. సర్కారు జిల్లాల వ్యవహారంలో సమాపకక్రియల్లో దివీతర ప్రత్యయాలముందు భూతకాలబోధక ప్రత్యయంలో నవర్ణం లోపిస్తుంది. చేయు ; చేన్‌ + ఇనాడు > చేన్‌ + ఇఆ + డు > చేశాడు. ఇ + ఆ > ఏ