పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

382 తెలుగు భాషా చరిత్ర

3. అభూతాదులు : (వర్తమానం, చేదర్థకం, ఉభయ,ప్రార్థన).

i. విధ్యాదులు, క్త్వార్ధక ప్రత్యయాలుకాక మిగతా ప్రత్యయాలముందు 'ఉండు' 'ఉన్‌' గా మారుతుంది.

ii. అనుబంధక్రియలుగా వచ్చిన ఉండు, కొను ధాతువులు విధ్యాదుల్లో ఓ, కోలుగా మారుతాయి. ఉదా : కూర్చో, చేసుకో.

iii. అనుబద్ధమైన ఉండు, కొనులు భూతాది ప్రత్యయాల ముందు వికల్బంగా 'ఉన్, కున్‌లుగా మారతాయి. ఉదా: కూర్చున్నాడు, చేసుకున్నాడు.

iv. (a) ధాతువు చివర 'యు' విధ్యాదికేతరప్రత్యయాలముందు 'న' కారంగా మారుతుంది. ఉదా: చేయు, చేసి, చేశాడు, చేస్తే, చేస్తాడు.

(b) 'చు, చ్చు' లకు ఇంచు ప్రత్యయంలో '౦చు'కు అభూతాది [ప్రత్యయాల ముందు 'న' కారా దేశమవుతుంది. ఉదా : పిలుచు, పిలుస్తాడు, పిలిస్తే, ఇచ్చు : ఇస్తాడు, ఇస్తే; చేయించు : చేయిస్తాడు, చేయిస్తే; గిచ్చు, గుచ్చు, నచ్చు. కొందరి వ్యవహారంలో నొచ్చు, పుచ్చు ; మెచ్చు, హెచ్చు-లకు ఈ ఆదేశంరాదు. ఆదేశం వచ్చే ధాతువులు : ఇచ్చు, చచ్చు, తెచ్చు, వచ్చు.

(c) ఆదేసకారం దకారాది ప్రత్యయంముందు దకారంగా మారుతుంది. ఉదా: పిలున్‌ + దాం > పిలుద్దాం, ఇన్‌ + దాం > ఇద్దాం, చేయిన్‌ + దాం > చేయిద్దాం. కొందరు తెలంగాణా వారి వ్యవహారంలో పిలుజ్దా౦, ఇజ్దా౦, చేయిజ్దా౦ అనే రూపాలున్నాయి. వారి భాషలో సమీకరణ కేవలం నాదతవరశే. ఇక్కడ జకారోచ్చారణ ఊ*ష్మం.

v. రెండక్షరాల ధాతువుల్లో దీర్ఘ స్వరపూర్వకమైన 'చ' వర్ణానికి విధ్యాదిక ప్రత్యాయాలముందు కొందరి వ్యవహారంలో 'య' వర్ణా దేశమవుతుంది. ఉదా : తూచు : తూయి > తుయ్యి, తూచటం, తూయటం. దాచు : దాయి, దాచటం, దాయటం.

vi. మూడక్షరాల ధాతుల్లో చివరివ్యంజనమైన 'చ' వర్ణానికి విధ్యాది ప్రత్యయాలముందు 'వ' వర్ణాదేశమవుతుంది. ఉదా : పిలుచు : పిలువు, పిలవట౦.


ప్రత్యయంగా విడదీయదగిన 'చు' లో చి వర్ణానికి కొందరి భాషలో కార్యం జరగదు. ఉదా : కాలు+చు : కాల్చు, కార్చటం, కాల్చు, కాలవటం.