Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : స౦గ్రహవర్ణనం 381

(a) సామర్థ్యార్థం :- కల, కలుగు, లే : ఉదా : రాగలడు, రాగలుగుతాడు, రాలేడు. 'కల' కు కాలబోధక ప్రత్యయ యోగంలో 'కలుగు' ఆదేశమవుతుంది. వ్యతిరేకంలో 'లే' ఆదేశం.

(b) అనుమత్యాద్యర్థం :- వచ్చు. ఉదా : లోపలికిరావచ్చు, మీరిక బయటికి వెళ్ళవచ్చు, నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు.

(c) నిషేధార్థం :- కూడదు,-రాదు, ఉదా : అసత్య మాడరాదు, అబద్దం చెప్పకూడదు. ఈ రూపానికి పురుషభేదంలేదు.

(d) 'తప్పనిసరి' అర్థంలో : వలయు > ఆలి : ఉదా: విద్యార్థులుబాగా చదవాలి. కాలబోధకత అవసరమైనప్పుడు ఈ రూపాలకు ఉండు, వచ్చు ధాతువులను ప్రయుక్తమవుతాయి. అయితే '-అలి '-అల్సి' అవుతుంది. ఉదా : వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి ఉంటుంది.

(e) అసామర్థ్యార్థంలో :- చాలు > చాల. ఉదా వాడు ఈపని చెయ్యజాలడు:

(f) కర్మణ్యర్థం :- పడు. ఉదా : తరవాత చెప్పబడుతుంది. కల, చాలు, పడులకు క్రియావిభక్తులు చేరతాయి.

(g) అనుమత్యర్థంలో '-ఇచ్చు' అనుబద్ధమవుతుంది. దీనిదానార్థంలో 'ఇచ్చు' కు వలేనే రూపాలుంటాయి. ఉదా : రానిచ్చాడు, కానీ, రానీయ్యలేదు, విధ్యేకవచనంలో 'ఇచ్చు' కు 'ఈ' ఆదేశం.

(h) సమీపభవిష్యార్థంలో 'పో' ధాతువు అనుప్రయుక్తమవుతుంది. ఉదా : రాబోయ్యాడు, పడబోయింది.

(i) ఈ అన్నంతరూపానికి అరుదుగా. ప్రయోజనార్థంకూడా ఉంది. అక్కరలేదు, అవసరంలేదు అనే రూపాలు అనుప్రయుక్తమవుతాయి. ఉదా : రానక్కరలేదు, రానవసరంలేదు.

13.12. క్రియాదాతువులోమార్పులు : ప్రత్యయాలుచేరినప్పుడు ధాతువులో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు ప్రత్యయవర్గాలనుబట్టి ఉంటాయి.

1. విధ్యాదులు : (విధి, నుణి, భావార్థకం, కణి)

2. భూతాదులు (భూతం, అప్యర్థకం).