380 తెలుగు భాషా చరిత్ర
ప్రయుక్త మవుతుంది. బహువచనంతో అండి చేరుతుంది. తేలంగాణంలో న్రి, రి, ౦డి చేరతాయి. ఉదా: రాండి, రాన్రి, రారి.
(b) క్రియావిభక్తులు:
ఏక వచన బహువచన ఉత్తమ : ను ము మధ్యమ : వు ప్రథమ మహత్తు: డు రు (మహన్మహతి) ఇతరః : ది వి (యి) (అవామత్తు)
ఇవే క్రియావిభక్తులు వ్యతిరేక సమాపక క్రియల్లోకూడా వాడతారు. కాని 'ది, వి' ప్రత్యయాలు 'దు, వు' లుగా మారతై, కొన్ని తెలంగాణ మాండలికాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. 'ది,వి' లు దీర్ఘస్వరాంత క్రియారూపాల తరవాత మాత్రమే 'దు, వు' లుగా మారతాయి ఉదా : చెయ్యది-రాదు.
3. వ్యతిరేక క్రియలు : (a) భూతకాల వ్యతిరేక క్రియలు అన్నంత రూపాలకు 'లేదు' అనే ప్రత్యయం చేర్చటంవల్ల ఏర్పడతాయి. ఇది సర్వలింగ, వచన, పురుషబోధకం. ఉదా : రాలేదు.
(b) వర్తమాన వ్యతిరేకక్రియలు 'అటమంత' రూపానికి 'లేదు' చేర్చటం వల్ల ఏర్పడతాయి. ఈ రూపంకూడ పురుషభేదాన్ని బట్టి మారదు. ఉదా : రావటం లేదు.
(c) భవిష్యద్భోధక వ్యతి రేకక్రియలు అన్నంతరూపాలకు క్రియావిభక్తులు చేర్చటంవల్ల ఏర్పడతాయి. ఉదా : రాను-రాము, రావు-రారు, రాడు-రారు, రాదు- రారు, రావు.
(d) వ్కతిరేక విధి అన్నంతరూపాలకు వద్దు చేర్చటంవల్ల ఏర్పడుతుంది. ఉదా : రావద్దు. వ్యతిరేకవిధికి ఇంకా చాలా రూపాలు వాడుకలో ఉన్నాయి. ఉదా : రాకు, రాబాకు, రాబోకు, రామాకు, రామోకు, మొ.
4. అన్నంతక్రియ : అన్నంతక్రియకు భిన్నార్ధాల్లో భిన్నక్రియలు అనుబద్ధ మవుతాయి.